Breaking News

Ind vs Eng: సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన యశస్వి జైస్వాల్‌

Published on Thu, 03/07/2024 - 16:19

Ind vs Eng 5th Test- Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. 

సొంతగడ్డపై ఇప్పటికే రెండు డబుల్‌ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్‌.. ధర్మశాలలో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ తనదైన షాట్లతో అలరిస్తున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ బ్యాట్‌తో వీరవిహారం చేస్తున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న అరుదైన రికార్డును జైస్వాల్‌ బద్దలు కొట్టాడు.

ఇంగ్లండ్‌తో తాజా టెస్టులో.. భారత ఇన్నింగ్స్‌లో తొమ్మిదవ ఓవర్‌ ముగిసే సరికి యశస్వి జైస్వాల్‌ మూడు సిక్స్‌లు కొట్టాడు. తద్వారా ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్‌గా జైస్వాల్‌ అవతరించాడు.

సచిన్‌ రికార్డు బద్దలు కొట్టి
గతంలో సచిన్‌ టెండుల్కర్‌ ఆస్ట్రేలియా మీద 25 సిక్సులు కొట్టగా.. జైస్వాల్‌ తాజాగా ఇంగ్లండ్‌పై 26వ సిక్సర్‌ను బాది.. అతడిని అధిగమించాడు. ఇక సచిన్‌కు ఇందుకోసం 74 ఇన్నింగ్స్‌ అవసరం కాగా.. జైస్వాల్‌ కేవలం 9 ఇన్నింగ్స్‌లోనే ఈ సిక్సర్ల రికార్డు క్రియేట్‌ చేయడం విశేషం.

కాగా ధర్మశాల మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్లు
26* - యశస్వి జైస్వాల్‌ ఇంగ్లండ్‌ మీద(9 ఇన్నింగ్స్‌)
25- సచిన్‌ టెండుల్కర్‌ ఆస్ట్రేలియా మీద(74 ఇన్నింగ్స్‌)
22- రోహిత్‌ శర్మ సౌతాఫ్రికా మీద(20 ఇన్నింగ్స్‌)
21- కపిల్‌ దేవ్‌ ఇంగ్లండ్‌ మీద(39 ఇన్నింగ్స్‌)
21- రిషభ్‌ పంత్‌ ఇంగ్లండ్‌ మీద (21 ఇన్నింగ్స్‌).

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)