Breaking News

Yashasvi Jaiswal: సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ ఇండియన్‌

Published on Thu, 03/07/2024 - 16:35

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్‌ కోహ్లి పేరిట ఉండిన రికార్డును (ఇంగ్లండ్‌పై టెస్ట్‌ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు, 656) బద్దలు కొట్టిన యశస్వి.. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఈ రికార్డు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ పేరిట ఉండింది. సచిన్‌.. ఆసీస్‌పై 74 ఇన్నింగ్స్‌ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్‌పై కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్‌ పేరిట ఉండిన రికార్డును చెరిపేశాడు.  

ఈ రికార్డుతో పాటు యశస్వి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి.. టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ ఇండియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి 1000 పరుగుల మార్కును తాకేందుకు 16 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. వినోద్‌ కాంబ్లీ ఈ మైలురాయిని కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన సచ్‌క్లిఫ్‌ పేరిట ఉంది. ఇతను కేవలం 12 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులను పూర్తి చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్‌ 27, పోప్‌ 11, రూట్‌ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్‌ 0, ఫోక్స్‌ 24, హార్ట్లీ 6, వుడ్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్‌ బషీర్‌ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత​.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్‌, 3 సిక్సర్లు) పరిమిత​ ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితా..

  • సునీల్‌ గవాస్కర్‌ 1971లో వెస్టిండీస్‌పై 774 పరుగులు
  • సునీల్‌ గవాస్కర్‌ 1978లో వెస్టిండీస్‌పై 732 పరుగులు
  • యశస్వి జైస్వాల్‌ 2024లో ఇంగ్లండ్‌పై 712 పరుగులు
  • విరాట్‌ కోహ్లి 2014/15లో ఆస్ట్రేలియాపై 692 పరుగులు

డబ్యూటీసీ 2023-25 సైకిల్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు జైస్వాల్‌
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)