Breaking News

సాకులు చెప్పలేదు.. ఉదయం 5.30 గంటలకే రోహిత్‌ ఇలా!

Published on Wed, 03/06/2024 - 13:19

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్య క్రీడా భారత్‌ రూపుదిద్దుకునే కార్యక్రమంలో చిత్తశుద్ధితో పాల్గొనడం రోహిత్‌ హుందాతనానికి నిదర్శనమని ప్రశంసించారు.   

కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో రోహిత్‌ శర్మ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగింట మూడు విజయాలతో ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా.. ధర్మశాల వేదికగా గురువారం నుంచి నామమాత్రపు ఐదో టెస్టు ఆడనుంది.

అయితే, నాలుగు- ఐదో టెస్టుకు మధ్య విరామం ఎక్కువగా ఉండటంతో రోహిత్‌ శర్మ సతీసమేతంగా అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొన్నాడు. గుజరాత్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌ అనంతరం తిరిగి విధుల్లో చేరేందుకు ధర్మశాల(హిమాచల్‌ ప్రదేశ్‌)కు పయనం కావాల్సింది.

అయితే, అంతకంటే ముందు భారత క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హమీర్‌పూర్‌ నియోజకవర్గంలోని బిలాస్‌పూర్‌కు చేరుకున్నాడు. అక్కడ జరిగిన ఖేల్‌‌ మహాకుంభ్‌ 3.0 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రోహిత్‌ శర్మతో పాటు టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌  కూడా ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలో అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘‘ఖేల్‌ మహాకుంభ్‌​ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఉదయం ఐదున్నర గంటలకే రోహిత్‌ శర్మ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఒకవేళ రోహిత్‌ అనుకుంటే.. మార్చి 7న ఆరంభం కానున్న ఐదో టెస్టును సాకుగా చూపి ఇక్కడికి రాకుండా మా ఆహ్వానాన్ని తిరస్కరించి ఉండవచ్చు.

కానీ అతడికి భవిష్య క్రీడా భారత్‌ ఇలాంటి కార్యక్రమాల నుంచే రూపుదిద్దుకుంటోందని తెలుసు. అందుకే ఇక్కడకు వచ్చాడు. అతడికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

కాగా ఈ ఈవెంట్‌ ఆరంభించిన అనంతరం రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌ కాసేపు బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడుతూ సందడి చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో బిలాస్‌పూర్‌కు దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మశాలకు చేరుకున్నారు.

చదవండి: 100th Test: అశ్విన్‌పై మాజీ స్పిన్నర్‌ సంచలన ఆరోపణలు

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)