Breaking News

ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌.. టీమిండియాకు శుభవార్త

Published on Wed, 02/28/2024 - 14:28

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త తెలిసింది. మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే ఆఖరి మ్యాచ్‌కు పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులో ఉంటాడని సమాచారం. వర్క్‌ లోడ్‌ కారణంగా నాలుగో టెస్ట్‌లో బుమ్రాకు రెస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ మింగుడుపడని వార్త కూడా వినిపిస్తుంది.

స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆఖరి మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. మెరుగైన చికిత్స కోసం రాహుల్‌ను అతి త్వరలో లండన్‌కు పంపించనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు ఆడిన రాహుల్‌.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్‌ సందర్భంగా తొడ కండరాల సమస్య తలెత్తడంతో తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజా సమాచారం నిజమైతే రాహుల్‌ ఆఖరి టెస్ట్‌లో ఆడటం అనుమానమే. 

కాగా, స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్న భారత్‌.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియాను గాయాల బెడద వేధిస్తూనే ఉంది. సిరీస్‌ ప్రారంభానికి ముందే వ్యక్తిగత కారణాల చేత విరాట్‌ కోహ్లి, గాయం కారణంగా మొహమ్మద్‌ షమీ దూరం కాగా.. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, జడేజా, బుమ్రా గాయాలు, ఇతరత్రా కారణాల చేత మధ్యలో పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. సీనియర్ల గైర్హాజరీ, గాయాల సమస్య వేధిస్తున్నప్పటికీ.. యంగ్‌ ఇండియా అద్భుత ప్రదర్శనలు చేసి సిరీస్‌ కైవసం చేసుకోవడం విశేషం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)