Breaking News

IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు

Published on Fri, 08/01/2025 - 17:41

టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్‌ ఓపెనర్లు బెక్‌ డకెట్‌ (Ben Duckett), జాక్‌ క్రాలీ సరికొత్త చరిత్ర లిఖించారు. భారత జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లండ్‌ ఓపెనింగ్‌ జోడీగా రికార్డులకెక్కారు. అదే విధంగా.. టీమిండియాపై టెస్టుల్లో అత్యధికసార్లు 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.

ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఓవల్‌ మైదానంలో గురువారం ఐదో టెస్టు మొదలైన విషయం తెలిసిందే. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఈ కీలక మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గిల్‌ సేన.. 224 పరుగులకు ఆలౌట్‌ అయింది.

224 పరుగులకు టీమిండియా ఆలౌట్‌
వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (38), ఐదో స్థానంలో ఆడిన కరుణ్‌ నాయర్‌ (57) తప్ప మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ (Gus Atkinson) ఐదు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలీ శుభారంభం అందించారు. డకెట్‌ 29, క్రాలీ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. టీమిండియాపై 936 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఆండ్రూ స్ట్రాస్‌- అలిస్టర్‌ కుక్‌ జోడీని వీరు అధిగమించారు.

కుక్‌-  స్ట్రాస్‌లను అధిగమించి..
కాగా డకెట్‌- క్రాలీ జోడీ టీమిండియాపై ఇప్పటికి ఓవరాల్‌గా 936 పరుగులు పూర్తి చేసుకోగా.. కుక్‌- స్ట్రాస్ కలిసి 20 ఇన్నింగ్స్‌లో 932 పరుగులు సాధించారు. అదే విధంగా.. అత్యధికంగా ఎనిమిదిసార్లు డకెట్‌- క్రాలీ 50 ప్లస్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ నమోదు చేశారు.

ఇదిలా ఉంటే.. డకెట్‌ అర్ధ శతకానికి చేరువైన వేళ టీమిండియా పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ అద్బుత డెలివరీతో అతడిని పెవిలియన్‌కు పంపాడు. 38 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేసిన డకెట్‌.. వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 

మరోవైపు.. భోజన విరామ సమయానికి  16 ఓవర్ల ఆట ముగిసేసరికి క్రాలీ అర్ధ శతకం (52) పూర్తి చేసుకోగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ 12 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్కోరు: 109/1 (16). కాగా డకెట్‌-క్రాలీ కలిసి తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించారు.

చదవండి: కెప్టెన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)