Breaking News

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌.. చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ

Published on Thu, 02/22/2024 - 15:45

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌లో టీమిండియా సారధి రోహిత్‌ శర్మ రెండు భారీ మైలురాళ్లపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ మరో 23 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో 4000 పరుగుల మార్కును చేరుకుంటాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ మరో ఏడు సిక్సర్లు బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. 

ప్రస్తుతం రోహిత్‌ 57 టెస్ట్‌ల్లో 45.2 సగటున 3978 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్‌ ఖాతాలో 11 టెస్ట్‌ శతకాలు, 16 అర్దశతకాలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలో రోహిత్‌ 470 మ్యాచ్‌లు ఆడి 593 సిక్సర్లు బాదాడు. 

కాగా, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో (మూడు మ్యాచ్‌ల అనంతరం) కొనసాగుతుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలుపొందగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో, రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా వరుస విజయాలు సాధించింది.

ఈ సిరీస్‌కు సంబంధించి రోహిత్‌ స్కోర్ల విషయానికొస్తే.. హిట్‌మ్యాన్‌ 6 ఇన్నింగ్స్‌లు ఆడి 40 సగటున సెంచరీ సాయంతో 240 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌ సహచర ఓపెనర్‌, టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. యశస్వి ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 109 సగటున రెండు డబుల్‌ సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 545 పరుగులు చేశాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)