Breaking News

#IndvsEng: కష్టపడాల్సి వచ్చింది.. అతడు అత్యద్భుతం: రోహిత్‌ శర్మ

Published on Mon, 02/26/2024 - 14:34

India vs England, 4th Test- Rohit Sharma Comments After Series Win: భారత గడ్డపై కూడా తగ్గేదేలేదు అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న ఇంగ్లండ్‌కు టీమిండియా కళ్లెం వేసింది. ఉపఖండంలో ఇలాంటి పప్పులు ఉడకవంటూ ‘బజ్‌బాల్‌’ పగిలేలా వరుస విజయాలతో మోత మోగించింది.

నాలుగో మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలోనే ఫలితం తేల్చి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఆరంభ మ్యాచ్‌లో తడ‘బ్యా’టుకు గురైనా.. హ్యాట్రిక్‌ విజయాలతో సొంతగడ్డపై ఆధిపత్యాన్ని చాటుకుంది.

విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి స్టార్లు లేకపోయినా కుర్రాళ్లు ఆ లోటును తీర్చి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా బ్యాటర్లు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ తమదైన ముద్ర వేయగలిగారు.

ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లే అధికంగా ఉన్న జట్టుతో ఇంగ్లండ్‌ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ సిరీస్‌ ఆసాంతం గెలుపు కోసం మేము ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అయినా.. నాలుగో టెస్టులోనే సిరీస్‌ ఫలితం తేల్చగలిగాం. కుర్రాళ్ల ఆట తీరు పట్ల నాకు గర్వంగా ఉంది.

మేము సాధించిన విజయాల పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాను. స్థానిక, దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ఆటగాళ్లు ఇక్కడ ఇలాంటి అద్భుతాలు చేయగలరో చూపించారు టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్లు అవన్నీ దాటుకుని ఇక్కడి దాకా వచ్చి తమను తాము నిరూపించుకున్నారు. 

ఈ మ్యాచ్‌లో ధ్రువ్‌ జురెల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత పరిణతితో ఆడాడు. కూల్‌గా, కామ్‌గా తన పని పూర్తి చేశాడు’’ అని రోహిత్‌ శర్మ.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు.

ఇది సమిష్టి విజయమని.. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా ఇలాంటి గెలుపు రుచి చూడటం ఎంతో ఆనందంగా ఉందని రోహిత్‌ పేర్కొన్నాడు. డ్రెస్సింగ్‌రూం వాతావరణం బాగానే ఉన్నా.. బయట తమ జట్టు గురించి వచ్చే వార్తలు, చేసే వ్యాఖ్యలు కుర్రాళ్లపై కాస్త ఒత్తిడి పెంచాయని తెలిపాడు.

అయితే, ఒత్తిడిని జయించి అద్బుత ప్రదర్శనలతో వారు తమను నిరూపించుక్ను తీరు అమోఘమని రోహిత్‌ శర్మ ఈ సందర్భంగా కొనియాడాడు. ఆఖరి టెస్టులోనూ గెలుపొంది 4-1తో ట్రోఫీని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య మార్చి 7 నుంచి నామమాత్రపు ఐదో టెస్టు జరుగనుంది.
 

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)