Breaking News

IND vs ENG: ముగిసిన నాలుగవ రోజు ఆట.. భారత్‌ స్కోరు ఎంతంటే..

Published on Sat, 07/26/2025 - 22:05

Update: నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 87(210), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ 78(167)తో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కంటే టీమిండియా 137 పరుగులు వెనుకబడి ఉంది.

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో పాటు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరి పోరాట పటిమ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ వంద పరుగుల మార్కు దాటింది. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య మాంచెస్టర్‌ వేదికగా బుధవారం నాలుగో టెస్టు మొదలైన విషయం తెలిసిందే.

ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (58), కేఎల్‌ రాహుల్‌ (46)లు రాణించగా..  సాయి సుదర్శన్‌ (61), రిషభ్‌ పంత్‌ (54) అర్ధ శతకాలు సాధించారు. ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ 41 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌ మూడు, క్రిస్‌ వోక్స్‌, లియామ్‌ డాసన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఇందుకు దీటుగా బదులిచ్చి ఏకంగా 669 పరుగులు సాధించింది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (84), బెన్‌ డకెట్‌ (94)లు బజ్‌బాల్‌తో దుమ్ములేపగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ (71) అద్భుత అర్థ శతకం సాధించాడు. జో రూట్‌ (150), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (141) భారీ శతకాలు బాదారు

ఫలితంగా ఏకంగా 669 పరుగులు సాధించిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. భారత రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అన్షుల్‌ కంబోజ్‌, మహ్మద్‌ సిరాజ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు బాదిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ ఈసారి డకౌట్‌గా వెనుదిరిగారు.

టీమిండియా ఇన్నింగ్స్‌లో నాలుగో బంతికి జైసూను, ఐదో బంతిని సాయిని ఇంగ్లండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ వెనక్కి పంపించాడు. ఇలా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయన భారత జట్టును కెప్టెన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ ఆదుకున్నారు. డ్రింక్స్‌ బ్రేక్‌ సమయానికి గిల్‌ 71, రాహుల్‌ 68 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?