Breaking News

Joe Root: రూట్‌ సరికొత్త చరిత్ర! ఇప్పటికి ఒకే ఒక్కడు..

Published on Fri, 02/23/2024 - 16:20

‘‘రూట్‌ నుంచి ఇంత వరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ రాలేదు. అనూహ్య రీతిలో బంతితో రాణిస్తున్నాడే తప్ప బ్యాట్‌తో మ్యాజిక్‌ చేయలేకపోతున్నాడు’’.. టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌పై వచ్చిన విమర్శలు.

అయితే, వాటన్నింటికీ నాలుగో టెస్టు సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు రూట్‌. రాంచి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది ఇంగ్లండ్‌. టీమిండియా అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ధాటికి 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రూట్‌.. బజ్‌బాల్‌ అంటూ దూకుడు ప్రదర్శించకుండా అచ్చమైన సంప్రదాయ క్రికెట్‌ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఏకాగ్రత చెదరనీయక.. పట్టుదలగా నిలబడి 219 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్‌లో 139 టెస్టు ఆడుతున్న రూట్‌.. 31వ శతకం నమోదు చేశాడు.

ఇక ఓవరాల్‌గా రూట్‌కు ఇది 31వ టెస్టు సెంచరీ కాగా.. టీమిండియాపై పదవది. తద్వారా భారత్‌పై అత్యధిక టెస్టు శతకాలు బాదిన క్రికెటర్‌గా రూట్‌ చరిత్రకెక్కాడు.
టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు
►10- జో రూట్(ఇంగ్లండ్‌- 52 ఇన్నింగ్స్‌*)
►9- స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా- 37)
►8- గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్‌- 30)
►8- వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్‌- 41)
►8- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా- 51)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)