Breaking News

Ind vs Eng: వారెవ్వా.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. టాపార్డర్‌ కకావికలం

Published on Fri, 02/23/2024 - 11:37

Ind vs Eng 4th Test- Akash Deep shows levels to Bazball: టీమిండియా బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ బెంగాల్‌ పేసర్‌.. శుభారంభం అందుకున్నాడు.

రాంచి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించగా.. రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ .. ఆకాశ్‌ దీప్‌నకు బంతినిచ్చాడు. తన తొలి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు.

ఈ క్రమంలో నాలుగో ఓవర్లో మరోసారి బాల్‌ అందుకున్న ఆకాశ్‌.. జాక్‌ క్రాలే క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే, అది నోబాల్‌గా తేలడంతో ఆకాశ్‌ దీప్‌నకు నిరాశ తప్పలేదు. అయితే, అతడు మరింత పట్టుదలగా నిలబడి తన పేస్‌ పవర్‌ ఏంటో ఇంగ్లండ్‌ బ్యాటర్లకు రుచిచూపించాడు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు
పదో ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. రెండో బంతికి ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(11)ను అవుట్‌ చేసిన ఆకాశ్‌ దీప్‌.. నాలుగో బంతికి వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ మరుసటి రెండో ఓవర్లోనే జాక్‌ క్రాలే(42)ను అద్భుతరీతిలో బౌల్డ్‌ చేశాడు.

ఆకాశ్‌ నో బాల్‌ తప్పిదంతో లైఫ్‌ పొందిన క్రాలే మళ్లీ అతడి చేతికే చిక్కడం విశేషం. ఇలా అరంగేట్రంలోనే బజ్‌బాల్‌కు కళ్లెం వేస్తూ ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చిన ఆకాశ్‌ దీప్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో అతడి పేరు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్‌ 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో ఆకాశ్‌ దీప్‌ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

చదవండి: Ind vs Eng: ఐదో టెస్టుకు కీలక స్పిన్నర్‌ దూరం.. ప్రకటించిన ఇంగ్లండ్‌! కారణం ఇదే

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)