Breaking News

తిరుగులేని టీమిండియా.. 11 ఏళ్లుగా కొనసాగుతున్న జైత్రయాత్ర

Published on Mon, 02/26/2024 - 17:59

స్వదేశంలో టీమిండియా విజయపరంపర 11 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో భారత జట్టు స్వదేశంలో రికార్డు స్థాయిలో 17 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించింది. 2013 ఫిబ్రవరిలో మొదలైన టీమిండియా జైత్రయాత్ర ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌ వరకు అప్రతిహతంగా సాగుతుంది.

ప్రపంచంలో ఏ జట్టు స్వదేశంలో వరుసగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. భారత్‌ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా రెండుసార్లు (1994-2001, 2004-2008) స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. భారత్‌, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్‌ (1976-1986), న్యూజిలాండ్‌ (2017-2021) జట్లు స్వదేశంలో 8 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించాయి.

స్వదేశంలో టీమిండియా సాధించిన 17 సిరీస్‌ (వరుసగా) విజయాలు.. 

  1. ఆస్ట్రేలియాపై 4-0
  2. వెస్టిండీస్‌పై 2-0
  3. సౌతాఫ్రికాపై 3-0
  4. న్యూజిలాండ్‌పై 2-0
  5. ఇంగ్లండ్‌పై 4-0
  6. బంగ్లాదేశ్‌పై 1-0
  7. ఆస్ట్రేలియాపై 2-1
  8. శ్రీలంకపై 1-0
  9. ఆఫ్ఘనిస్తాన్‌పై 1-0
  10. వెస్టిండీస్‌పై 2-0
  11. సౌతాఫ్రికాపై 3-0
  12. బంగ్లాదేశ్‌పై 2-0
  13. ఇంగ్లండ్‌పై 3-1
  14. న్యూజిలాండ్‌పై 1-0
  15. శ్రీలంకపై 2-0
  16. ఆస్ట్రేలియాపై 2-1
  17. ఇంగ్లండ్‌పై 3-1 (మరో మ్యాచ్‌ మిగిలి ఉంది)

ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి గెలుపొందింది. స్వల్ప లక్ష్య ఛేదనలో (192) భారత జట్టు తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో మెరిసిన దృవ్‌ జురెల్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ రాణించి (39 నాటౌట్‌) జట్టు విజయంలో ప్రధాన ప్రాత పోషించాడు. జురెల్‌కు జతగా శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌) సైతం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 

స్కోర్‌ వివరాలు.. 

  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 353 (రూట్‌ 122 నాటౌట్‌, జడేజా 4/67)
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 307 (దృవ్‌ జురెల్‌ 90, షోయబ్‌ బషీర్‌ 5/119)
  • ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 145 (జాక్‌ క్రాలే 60, అశ్విన్‌ 5/51)
  •  భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 192/5 (రోహిత్‌ శర్మ 55, షోయబ్‌ బషీర్‌ 3/79)
  • 5 వికెట్ల తేడాతో భారత్ విజయం
  • ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: దృవ్‌ జురెల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)