Breaking News

Ind vs Eng: టీమిండియాకు శుభవార్త!.. పాపం అతడిపై వేటు!

Published on Thu, 01/30/2025 - 20:12

ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India Vs England)కి ముందు టీమిండియాకు శుభవార్త! నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌(Rinku Singh) పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. పుణె మ్యాచ్‌లో ఆడేందుకు అతడు సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే ధ్రువీకరించాడు.

భారత క్రికెట్‌ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికి మూడు పూర్తి చేసుకుంది. కోల్‌కతా, చెన్నై టీ20లలో గెలిచిన టీమిండియా.. రాజ్‌కోట్‌(Rajkot T20I)లో మాత్రం విఫలమైంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్‌పై ఆధిక్యం 2-1కు తగ్గింది.

వెన్ను నొప్పి కారణంగా..
ఇదిలా ఉంటే.. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్‌.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు మాత్రం దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా అతడు ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడు ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది.

జురెల్‌పై వేటు పడే అవకాశం
ఈ విషయం గురించి కోచ్‌ డష్కాటే మాట్లాడుతూ.. అతడు బుధవారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసినట్లు తెలిపాడు. ఒకవేళ రింకూ తిరిగి వస్తే బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరింత పటిష్టమవుతుంది. అయితే, అతడు వస్తే ధ్రువ్‌ జురెల్‌పై వేటు పడే అవకాశం ఉంది.

మూడో టీ20లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన జురెల్‌.. ఒత్తిడిలో చిత్తైపోయాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. నిజానికి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఇంకాస్త ముందు వస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కోసం వాషింగ్టన్‌ సుందర్‌- అక్షర్‌ పటేల్‌లను ఆరు, ఏడు స్థానాల్లో పంపడంతో జురెల్‌కు దెబ్బ పడింది.

రింకూ లేదంటే.. ఆ ఇద్దరిలో ఒకరు?
ఇక రింకూకు కోల్‌కతా టీ20లో బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. గతేడాది కూడా అతడి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. పద్దెనిమిది మ్యాచ్‌లలో కలిపి అతడు 245 పరుగులే చేశాడు. 

అయితే, 2023లో మాత్రం 12 మ్యాచ్‌లలోనే 262 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచుతారా? లేదంటే.. శివం దూబే, రమణ్‌దీప్‌ సింగ్‌లలో ఒకరికి తుదిజట్టులో చోటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా శుక్రవారం పుణె వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉండగా.. 2-2తో సమం చేయాలని బట్లర్‌ బృందం భావిస్తోంది. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన ఐదో టీ20 జరుగుతుంది.

ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టు(అప్‌డేటెడ్‌)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివం దూబే, రమణ్‌దీప్‌ సింగ్‌.

చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్‌.. రంజీల్లో ఆల్‌టైమ్‌ రికార్డు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)