Breaking News

Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే

Published on Fri, 01/31/2025 - 10:55

ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్‌పై బ్యాట్‌ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

పక్కనపెడితేనే బెటర్‌
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్‌ జురెల్‌(Dhruv Jurel), వాషింగ్టన్‌ సుందర్‌(Washington Sundar) సేవలను మేనేజ్‌మెంట్‌ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్‌ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్‌ సుందర్‌ను బౌలర్‌గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్‌లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్‌లో అతడు తొలి బంతికే వికెట్‌ తీశాడు. బెన్‌ డకెట్‌ను అవుట్‌ చేశాడు.

అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్‌ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్‌లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.

ఒకవేళ ఒకే ఒక్క ఓవర్‌ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్‌ జురెల్‌ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

నలుగురు బౌలర్లు
ఇక ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్‌ వర్మ వన్‌డౌన్‌లో.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నాలుగు, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.

ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. లోయర్‌- మిడిల్‌ ఆర్డర్‌లో లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌గా అతడు చక్కటి ఆప్షన్‌ అని తెలిపాడు. రాజ్‌కోట్‌లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్‌ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.

అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ ఉండాలి. ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్‌ లేదంటే.. ఆల్‌రౌండర్‌ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్‌ చక్రవర్తిలతో పాటు.. అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌ కూడా బౌల్‌ చేయగలరన్న ఆకాశ్‌ చోప్రా.. తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌ల బదులు.. అర్ష్‌దీప్‌ సింగ్‌, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.

ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టు
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్ షమీ.

చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్‌.. రంజీల్లో ఆల్‌టైమ్‌ రికార్డు

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)