Breaking News

5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్‌

Published on Fri, 07/11/2025 - 18:58

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఐదు వికెట్ల‌తో చెల‌రేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగుల‌కు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ఇంగ్లీష్ జ‌ట్టు.. అద‌నంగా 136 ప‌రుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్‌(104) అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. అత‌డితో పాటు బ్రైడ‌న్ కార్స్‌(56), జేమీ స్మిత్‌(51), ఓలీ పోప్‌(44), స్టోక్స్‌(44) రాణించారు.

నిప్పులు చెరిగిన బుమ్రా..
రెండో రోజు ఆట‌లో బుమ్రా నిప్పులు చెరిగాడు. బుమ్రా ఆరంభంలోనే బెన్ స్టోక్స్‌, రూట్‌, వోక్స్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ‌తీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను కార్స్‌, స్మిత్ చక్కదిద్దారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని సిరాజ్‌ బ్రేక్‌ చేశాడు. 

అనంతరం ఆర్చర్‌ను ఔట్‌ చేసిన బుమ్రా.. లార్డ్స్‌లో తొలి ఫైవ్‌ వికెట్ల హాల్‌ను నమోదు చేశాడు. ఇక  భారత బౌలర్లలో బుమ్రాతో పాటు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. రవీంద్ర జడేజాకు ఒక్క వికెట్‌ దక్కింది.
చదవండి: IND vs ENG: బుమ్ బుమ్ బుమ్రా.. దెబ్బ‌కు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో వైర‌ల్‌

 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)