Breaking News

చెత్త రికార్డు.. అనిల్‌ కుంబ్లేను అధిగమించిన ఆండర్సన్‌

Published on Fri, 02/16/2024 - 19:41

రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ అనవరమైన చెత్త రి​కార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అ‍త్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అవతరించాడు. ఈ చెత్త రికార్డును ఆండర్సన్‌.. భారత మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే ఖాతాలో నుంచి లాగేసుకున్నాడు.

2008లో రిటైరైన కుంబ్లే 132 మ్యాచ్‌ల టెస్ట్‌ కెరీర్‌లో 18, 355 పరుగులు సమర్పించుకోగా.. ఆండర్సన్‌ తన 185వ టెస్ట్‌లో కుంబ్లే రికార్డును అధిగమించాడు (18, 371). ఈ జాబితాలో లంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌ మూడో స్థానంలో (133 టెస్ట్‌ల్లో 18180 పరుగులు) ఉండగా.. ఆసీస్‌ లెజెండ్‌ షేన్‌ వార్న్‌ (17995), ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (16719) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

41 ఏళ్ల ఆండర్సన్‌ ప్రస్తుతం 696 వికెట్లతో టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇదే మ్యాచ్‌లో భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు వేసిన ఆండర్సన్‌ 61 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్‌; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) అనంతరం ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనితో పాటు జో రూట్‌ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (15), ఓలీ పోప్‌ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్‌ అశ్విన్‌కు దక్కగా.. పోప్‌ను సిరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిశారు. 
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)