Breaking News

శతక్కొట్టిన డకెట్‌.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్‌

Published on Fri, 02/16/2024 - 17:56

రాజ్‌కోట్‌ టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్‌; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. డకెట్‌తో పాటు జో రూట్‌ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (15), ఓలీ పోప్‌ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్‌ అశ్విన్‌కు దక్కగా.. పోప్‌ను సిరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 326/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 119 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌, సెంచరీ హీరో రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి 112 పరుగుల వద్ద ఔట్‌ కాగా.. మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు కుల్దీప్‌ తన స్కోర్‌ మరో 3 పరుగులు జోడించి 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

ఇవాళ క్రీజ్‌లో వచ్చిన అరంగేట్ర బ్యాటర్‌ దృవ్‌ జురెల్‌ 46 పరుగులు, అశ్విన్‌ 37, బుమ్రా 26 పరుగులు చేసి ఔటయ్యారు. సిరాజ్‌ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో బుమ్రా బ్యాట్‌ ఝులిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 4, రెహాన్‌ అహ్మద్‌ 2, జేమ్స్‌ ఆండర్సన్‌, టామ్‌ హార్ట్లీ, జో రూట్‌ తలో వికెట్‌ పడగొట్టారు. రెండో రోజు ఆటలో జాక్‌ క్రాలేను ఔట్‌ చేయడం ద్వారా భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు చెరో మ్యాచ్‌ గెలిచిన విషయం తెలిసిందే.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)