Breaking News

#Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం

Published on Thu, 02/15/2024 - 09:56

Ind vs Eng 3rd Test- Sarfaraz Khan Debut- Beautiful moment: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తున్న అతడి నిరీక్షణకు గురువారం(ఫిబ్రవరి 15) తెరపడింది.

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్‌ టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. ఆ సమయంలో తండ్రి నౌషధ్‌ ఖాన్‌, సర్ఫరాజ్‌ భార్య రొమానా జహూర్‌ అతడి పక్కనే ఉన్నారు.

ఈ క్రమంలో తన క్యాప్‌ను తండ్రికి చూపించగా.. అతడు దానిని ఆప్యాయంగా ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

వెంటనే సర్ఫరాజ్‌ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఇక రొమానా సైతం కంటతడి పెట్టగా.. సర్ఫరాజ్‌ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అన్నాదమ్ముళిద్దరూ క్రికెటర్లే
మహారాష్ట్రలో 1997లో జన్మించిన సర్ఫరాజ్‌ ఖాన్‌ క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తండ్రి నౌషద్‌ ఖాన్‌ది కీలక పాత్ర. సర్ఫరాజ్‌తో పాటు అతడి తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ కూడా క్రికెటరే. ఇటీవలే అతడు అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆడాడు. యువ భారత్‌ ఫైనల్‌ చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

అందుకే ఆలస్యం!
ఇక సర్ఫరాజ్‌ ఖాన్‌ దేశవాళీ క్రికెట్లో ముఖ్యంగా రంజీల్లో అద్భుతంగా రాణించినప్పటికీ టీమిండియా ఎంట్రీ ఆలస్యమైంది. అతడి దూకుడు, ఆటిట్యూడ్‌ కారణంగానే టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌ను పక్కనపెట్టారనే వార్తలు వినిపించాయి. అయితే, అభిమానులు మాత్రం ప్రతిభావంతుడైన ఆటగాడికి అన్యాయం జరుగుతోందంటూ అనేక సందర్భాల్లో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రానికి మార్గం సుగమమైంది. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న  ఈ మ్యాచ్‌ ద్వారా ఉత్తరప్రదేశ్‌ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ కూడా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

చదవండి: Dhruv Jurel: తండ్రి కార్గిల్‌ యుద్ధంలో.. తల్లి బంగారు గొలుసు అమ్మి మరీ!

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)