Breaking News

అతడొక వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌.. మా ఓటమికి కారణం అదే: సూర్య

Published on Wed, 01/29/2025 - 09:45

ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్‌ విజయంతో సిరీస్‌ గెలవాలని భావించిన టీమిండియాకు చుక్కెదురైంది. రాజ్‌కోట్‌ టీ20లో సూర్యకుమార్‌ సేన ప్రత్యర్థి చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యం 2-1కు తగ్గింది.

బెన్‌ డకెట్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ
నిరంజన్‌ షా స్టేడియంలో మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసింది. ఆదిలోనే హార్దిక్‌ పాండ్యా ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌(5) వికెట్‌ తీసి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(Ben Ducket) ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు.

మెరుపు అర్ధ శతకం బాది మెరుగైన స్కోరుకు బాటలు వేశాడు. డకెట్‌.. 28 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 51 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(24) కూడా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించగా వరుణ్‌ చక్రవర్తి అతడిని బోల్తా కొట్టించాడు.

లివింగ్‌స్టోన్‌ ధనాధన్‌
మిగతా వాళ్లలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌(Liam Livingstone- 24 బంతుల్లో 43 రన్స్‌) దంచికొట్టగా.. ఆదిల్‌ రషీద్‌(10), మార్క్‌ వుడ్‌(10) డబుల్‌ డిజిట్‌ స్కోర్లతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్‌ 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్‌ పాండ్యా రెండు, రవి బిష్ణోయి, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

టీమిండియా తడ‘బ్యాటు’
ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. ఓపెనర్లలో సంజూ శాంసన్‌(3) మరోసారి నిరాశపరచగా.. అభిషేక్‌ శర్మ(14 బంతుల్లో 24) కాసేపు మెరుపులు మెరిపించాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(14) మరోసారి విఫలం కాగా.. వాషింగ్టన్‌ సుందర్‌(6),  ధ్రువ్‌ జురెల్‌(2) చేతులెత్తేశారు.

ఈ క్రమంలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ హార్దిక్‌ పాండ్యా (35 బంతుల్లో 40) మరో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(15)తో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఇక టెయిలెండర్లలో మహ్మద్‌ షమీ 7 పరుగులు చేయగా.. రవి బిష్ణోయి 4, వరుణ్‌ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా ఉన్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో 26 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. బ్యాటింగ్‌ వైఫల్యం వల్లే ఓటమి ఎదురైందని విచారం వ్యక్తం చేశాడు. ‘‘మ్యాచ్‌ సాగేకొద్దీ మంచు ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని భావించాను. హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్‌ మా చేతుల్లో ఉందనుకున్నా.

అతడొక వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌
కానీ ఆదిల్‌ రషీద్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అందుకే అతడిని వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌ అంటారు. మాకు స్ట్రైక్‌ రొటేట్‌ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. స్పిన్నర్లు అవసరం ఎంతగా ఉంటుందో మాకు తెలుసు. అందుకే మా జట్టులో వారే ఎక్కువగా ఉన్నారు.

ప్రతి టీ20 మ్యాచ్‌ నుంచి మేము సరికొత్త పాఠాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈసారి బ్యాటింగ్‌ పరంగా మా పొరపాట్లు ఏమిటో గుర్తించగలిగాం. ఇక షమీ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తాడు.

మరోవైపు.. వరుణ్‌ చక్రవర్తి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు సాధిస్తున్న ఫలితాలే.. అతడి క్రమశిక్షణ, కఠిన శ్రమకు నిదర్శనం. మైదానం లోపలా.. వెలుపలా ఆట పట్ల అతడి అంకితభావం ఒకేలా ఉంటుంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ వెటరన్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ కీలకమైన ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ(18) వికెట్‌ తీసి.. టీమిండియా ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో జేమీ ఓవర్టన్‌ మూడు, బ్రైడన్‌ కార్సే, జోఫ్రా ఆర్చర్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్‌వుడ్‌ ఒక వికెట్‌ తీశాడు. ఇక తన అద్భుత ప్రదర్శన(5/24)కు గానూ టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)