Breaking News

చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న అర్షదీప్‌

Published on Tue, 01/28/2025 - 17:38

టీమిండియా లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జనవరి 28) జరుగబోయే మూడో టీ20లో అర్షదీప్‌ మరో రెండు వికెట్లు తీస్తే.. టీ20ల్లో భారత్‌ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం అర్షదీప్‌ 62 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 21వ స్థానంలో ఉన్నాడు.

తొలి పేసర్‌గా చరిత్రకెక్కనున్నాడు..!
నేటి మ్యాచ్‌లో అర్షదీప్‌ మరో రెండు వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా  100 వికెట్లు పడగొట్టిన పేసర్‌గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్‌ పేసర్ హరీస్ రౌఫ్‌ పేరిట ఉంది. రౌఫ్‌ 71 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. అర్షదీప్‌కు తన 63వ మ్యాచ్‌లోనే 100 వికెట్ల మైలురాయిని క్రాస్‌ చేసే అవకాశం వచ్చింది.

రషీద్‌ 53 మ్యాచ్‌ల్లోనే..!
టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన రికార్డు రషీద్‌ ఖాన్‌ పేరిట ఉంది. రషీద్‌ 53 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు. 2021లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. రషీద్‌ తర్వాత అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత నేపాల్‌ స్పిన్నర్‌ సందీప్ లామిచ్చనేకు దక్కుతుంది. సందీప్‌ 54 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.

టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లు
రషీద్‌ ఖాన్‌ (53 మ్యాచ్‌లు)
సందీప్ లామిచ్చనే (54 మ్యాచ్‌లు)
వనిందు హసరంగ (63 మ్యాచ్‌లు)
ఎహసాన్‌ ఖాన్‌ (71 మ్యాచ్‌లు)
హరీస్‌ రౌఫ్‌ (71 మ్యాచ్‌లు)

నేటి మ్యాచ్‌లో అర్షదీప్‌ మరో రెండు వికెట్లు తీస్తే టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా హసరంగతో కలిసి సంయుక్తంగా నిలుస్తాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న అర్షదీప్‌కు నేటి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అర్షదీప్‌ 3 వికెట్లు తీశాడు. అర్షదీప్‌ రెండు రోజుల కిందటే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ 2024గా ఎంపికైన విషయం తెలిసిందే.

భారత్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. నేటి మ్యాచ్‌లోనూ భారత్‌ ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తుంది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. 

ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ (39 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రెండో మ్యాచ్‌లో తిలక్‌ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విశేషంగా రాణించారు. వీరి ప్రదర్శనల కారణంగానే భారత్‌ తొలి రెండు టీ20ల్లో నెగ్గింది.

 

 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)