Breaking News

Ind vs Eng 2nd Test: విశాఖపట్నం చేరుకున్న టీమిండియా

Published on Tue, 01/30/2024 - 16:43

సాక్షి, విశాఖపట్నం: రెండో టెస్టు కోసం టీమిండియా- ఇంగ్లండ్‌ జట్లు మంగళవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఈ క్రమంలో క్రికెటర్లను నేరుగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. దూరం నుంచే వారిని పలకరిస్తూ మురిసిపోయారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రోహిత్‌ సేన- స్టోక్స్‌ బృందం మధ్య తొలి టెస్టుకు హైదరాబాద్‌ వేదికైంది.

హైదరాబాద్‌లో ఓటమిపాలై
ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఇంగ్లండ్‌ 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. విశాఖలోని డాక్టర్‌ వైస్‌ రాజశేఖర్‌రెడ్డి క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. 

విశాఖలో విజయమే లక్ష్యంగా
ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించనుంది. అదే విధంగా.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఏసీఏ ఉచిత ప్రవేశం కల్పించనుంది. అంతేగాకుండా.. రాష్ట్రంలో ఉన్న క్లబ్‌ క్రీడాకారులు కూడా.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది ఫ్రీగా మ్యాచ్‌ చూసే అవకాశం ఇవ్వనుంది.

ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ అమ్మమ్మగారి ఊరైన వైజాగ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతోంది. సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరం కావడం ప్రభావం చూపే అవకాశం ఉంది.

చదవండి: Ind vs Eng: రోహిత్‌ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్‌ అవసరమా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)