Breaking News

కోహ్లి, శ్రేయస్‌ రాణించినా.. స్వల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌట్‌

Published on Thu, 07/16/2026 - 21:12

కార్డిఫ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్‌ కోహ్లి (65), శ్రేయస్‌ అయ్యర్‌ (66) రాణించడంతో భారత్‌ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. 

ఓ దశలో (178-3) భారీ స్కోర్‌ చేసేలా కనిపించిన భారత్‌.. విరాట్‌ కోహ్లి ఔటయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్‌ క్రీజ్‌లో పాతుకుపోయినప్పటికీ.. అతడికి ఎవరు పెద్దగా సహకరించలేదు. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 230 పరుగుల మార్కును తాకగలిగింది. అట్కిన్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌లో బుమ్రా 3 ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదాడు.

అంతకుముందు భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ (26), శుభ్‌మన్‌ గిల్‌ (31) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ స్థానంలో ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచారు. గత మ్యాచ్‌లో అద్భుత అర్ద శతకాలతో సత్తా చాటిన వాషింగ్టన్‌ సుందర్‌ (2), అక్షర్‌ పటేల్‌ (1) ఈ మ్యాచ్‌లో చేతెల్తేశారు. 

విధ్వంసకర ఆటగాడు శివమ్‌ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యారు. జోఫ్రా ఆర్చర్‌ వరుస బంతుల్లో అక్షర్‌, దూబేలను ఔట్‌ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే గుర్నూర్‌ బ్రార్‌ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రసిద్ద్‌ కృష్ణ (0) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, అట్కిన్సన్‌ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్‌ మహమూద్‌ 2, సామ్‌ కర్రన్‌, విల్‌ జాక్స్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)