IND VS ENG 1st Test Day 5: టీమిండియాను కలవరపెడుతున్న చెడు శకునాలు..!

Published on Tue, 06/24/2025 - 15:49

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌ గెలవాలంటే చివరి రోజు 350 పరుగులు (90 ఓవర్లలో) సాధించాలి. అదే భారత్‌ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి. ఆధునిక టెస్ట్‌ క్రికెట్‌లో రెండూ అసాధ్యం కాదు. ఫలితం ఏ జట్టుకైనా అనుకూలంగా రావచ్చు.

అయితే, గత రికార్డులను పరిశీలిస్తే మాత్రం ఎ‍డ్జ్‌ ఇంగ్లండ్‌కే సూచిస్తున్నాయి. 2019లో ఇదే మైదానంలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్‌ నమ్మశక్యంకాని శతకాన్ని (135 నాటౌట్‌) బాది ఇంగ్లండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. 

లీడ్స్‌ మైదానానికి 350 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఘన చరిత్ర ఉండటం ఐదో రోజు ఆట​కు ముందు భారత ఆటగాళ్లను డిఫెన్స్‌లో పడేస్తుంది. అప్పట్లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లండే కావడం టీమిండియాను మరింత బయపెడుతుంది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సైతం చివరి రోజు 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తగ్గేదేలేదంటున్నారు.

చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాను మరో చెడు సూచకం కూడా బయపెడుతుంది. భారత్‌ తమ యావత్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 350 ప్లస్‌ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఒకే ఒకసారి చతికిలపడింది. టీమిండియా 59 మ్యాచ్‌ల్లో 350 ప్లస్‌ లక్ష్యాలను కాపాడుకునేందుకు బరిలోకి దిగగా.. 42 సార్లు సఫలమైంది. ఒకే ఒక సందర్భంలో బోల్తా పడింది. ఆ ఒక్క ఓటమి ఇంగ్లండ్‌ చేతిలోనే కావడం టీమిండియాను కలవరపెడుతుంది. 

2022లో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 378 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో రూట్‌, బెయిర్‌స్టో అద్భుత శతకాలు సాధించి ఇంగ్లండ్‌ను గెలిపించారు.

మరోవైపు చివరి రోజు ఆటకు ముందు వాతావరణం కూడా భారత్‌ విజయానికి అడ్డుకట్ట వేసేలా కనిపిస్తుంది. మ్యాచ్‌ మధ్య మధ్యలో వరుణుడు పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత బౌలర్లు చివరి రోజు ఏం చేస్తారోనని టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్కోర్‌ వివరాలు..
భారత్‌: 471 & 364
ఇంగ్లండ్‌: 465 & 21/0

చివరి రోజు భారత్‌ గెలుపుకు 10 వికెట్లు కావాలి. అదే ఇంగ్లండ్‌ గెలవాలంటే 90 ఓవర్లలో 350 పరుగులు చేయాలి. ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)