Breaking News

IND VS ENG 1st Test Day 5: రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్‌

Published on Tue, 06/24/2025 - 21:24

లీడ్స్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. చివరి రోజు ఆటలో (371 పరుగుల లక్ష్య ఛేదనలో) తొలి రెండు సెషన్లలో (253/2) ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్‌.. రెండో సెషన్‌ చివరి దశలో అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. లక్ష్యానికి 118 పరుగుల దూరంలో ఉన్న సమయంలో శార్దూల్‌ వరుస బంతుల్లో సెట్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ (149), ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌  హ్యారీ బ్రూక్‌ను (0) ఔట్‌ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టాడు.

భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 52 నిమిషాల సమయంలో వర్షం మరోసారి మొదలుకావడంతో టీ బ్రేక్‌ను ముందుగానే ప్రకటించారు. టీ విరామం సమయానికి ఇంగ్లండ్‌ లక్ష్యానికి 102 పరుగుల దూరంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. క్రీజ్‌లో జో రూట్‌ (14), బెన్‌ స్టోక్స్‌ (13) ఉన్నారు. ఒకవేళ టీ విరామం తర్వాత వర్షం తగ్గి మ్యాచ్‌ యధావిధిగా సాగితే ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. భారత్‌ గెలవాలంటే మరో 6 వికెట్లు తీయాలి.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 21/0 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. డకెట్‌, జాక్‌ క్రాలే (65) మొండి పట్టుదలతో ఆడటంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. డకెట్‌, క్రాలే తొలి వికెట్‌కు 188 పరుగులు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ గెలుపుకు బలమైన పునాది వేశారు. 

ఈ దశలో ప్రసిద్ద్‌ కృష్ణ క్రాలే, పోప్‌ను (8) స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేసి భారత్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చాడు. అయితే సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత రెచ్చిపోయిన డకెట్‌ వేగంగా పరుగులు సాధిస్తూ లక్ష్యాన్ని చిన్నదిగా చేశాడు. ఈ దశలో శార్దూల్‌ వరుస బంతుల్లో డకెట్‌, బ్రూక్‌ను ఔట్‌ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు.

ఇవాల్టి ఆటలో తొలి సెషన్‌ వరకు ఎలాంటి ఆటంకం కలిగించని వర్షం​.. రెండో సెషన్‌లో ఓ సారి, టీ​కి ముందు మరోసారి పలకరించింది.

స్కోర్‌ వివరాలు.. 
భారత్‌: 471 (జైస్వాల్‌ 101, గిల్‌ 147, పంత్‌ 134) & 364 (రాహుల్‌ 137, పంత్‌ 118)
ఇంగ్లండ్‌: 465 (పోప్‌ 106, బ్రూక్‌ 99) & 269/4 (డకెట్‌ 149, క్రాలే 65)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)