Breaking News

Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్‌ రాహుల్‌

Published on Mon, 06/23/2025 - 19:15

ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల వద్ద అవుటైన ఈ స్టార్‌ ఓపెనర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ పెద్దన్నలా ఆదుకుని బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. 202 బంతుల్లో వంద పరుగుల మార్కును అందుకున్నాడు.

రాహుల్‌ శతక ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ కూడా అదరగొడుతున్నాడు. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పంత్‌ కూడా సెంచరీ బాదాడు.

కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు ఆరంభమైంది.

టాస్‌ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (134) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది.

ఇందుకు బదులుగా స్టోక్స్‌ బృందం తమ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేయగా.. భారత్‌కు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగా.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ నాలుగు పరుగులు మాత్రమే చేసి.. బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో జేమీ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ పట్టుదలగా నిలబడగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ 30 పరుగులు చేశాడు.

ఇక నాలుగో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలో రాహుల్‌- పంత్‌ నిలకడగా ఆడుతూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 69.4 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి పంత్‌ 100, రాహుల్‌ 112 పరుగులతో ఉన్నారు. టీమిండియా 270 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)