IND VS ENG 1st Test: సెహ్వాగ్‌ సరసన రాహుల్‌.. గవాస్కర్‌ ఒక్కడే మిగిలాడు..!

Published on Mon, 06/23/2025 - 18:18

లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 47 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్‌.. 87 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. రాహుల్‌కు కెరీర్‌లో ఇది 18వ హాఫ్‌ సెంచరీ. 

SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) ఓపెనర్‌గా అతనికిది తొమ్మిదో హాఫ్‌ సెంచరీ. ఈ హాఫ్‌ సెంచరీతో రాహుల్‌ భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, మరో మాజీ ఓపెనర్‌ మురళీ విజయ్‌ రికార్డును సమం చేశాడు. భారత ఓపెనర్లుగా సెహ్వాగ్‌, మురళీ కూడా సేనా దేశాల్లో తలో 9 హాఫ్‌ సెంచరీలు చేశారు. ఈ విభాగంలో సునీల్‌ గవాస్కర్‌ ఒక్కడే ప్రస్తుతం రాహుల్‌ కంటే ముందున్నాడు. భారత ఓపెనర్‌గా గవాస్కర్‌ సేనా దేశాల్లో 19 హాఫ్‌ సెంచరీలు చేశాడు.

సేనా దేశాల్లో అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు చేసిన భారత ఓపెనర్లు:

19 - సునీల్ గవాస్కర్ 57 ఇన్నింగ్స్‌లలో
9* - కేఎల్ రాహుల్ 42 ఇన్నింగ్స్‌లలో
9 - మురళీ విజయ్ 42 ఇన్నింగ్స్‌లలో
9 - వీరేంద్ర సెహ్వాగ్ 49 ఇన్నింగ్స్‌లలో

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ​ తగిలింది. తొలి ఓవర్‌ చివరి బంతికే (24.6వ ఓవర్‌) బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.

ఈ దశలో రిషబ్‌ పంత్‌ రాహుల్‌కు జత కలిశాడు. వీరిద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. లంచ్‌ విరామం సమయానికి భారత్‌ స్కోర్‌ 153/3గా ఉంది. రాహుల్‌ 72, పంత్‌ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్‌ ఆధిక్యం 159 పరుగులుగా ఉంది. 

భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (4) విఫలం కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (30) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 2, స్టోక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు భారత్‌, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్‌ చేశాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్‌ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్‌ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్‌ 40, క్రిస్ వోక్స్‌ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. 

ఫలితంగా ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
 

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)