Breaking News

వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్‌..!

Published on Fri, 10/04/2024 - 11:46

భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. అక్టోబర్‌ 6న బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టీ20లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు సాధిస్తే.. పొట్టి క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. 

స్కై ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 71 మ్యాచ్‌లు ఆడి 16 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు. స్కైతో పాటు మలేషియా ఆటగాడు విరన్‌దీప్‌ సింగ్‌, టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కూడా 16 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నారు. అయితే వీరిద్దరితో పోలిస్తే స్కై అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. 

విరన్‌దీప్‌ 84 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిస్తే.. విరాట్‌ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు సాధించాడు. ఈ జాబితాలో స్కై, విరన్‌దీప్‌, విరాట్‌ తర్వాత జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రజా (15), ఆఫ్ఘన్‌ ఆటగాడు మొహమ్మద్‌ నబీ (14), టీమిండియా టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (14) ఉన్నారు.

కాగా, బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు గ్వాలియర్‌లోని మాధవరావ్‌ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్‌ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్‌ 12న హైదరాబాద్‌ వేదికగా జరుగనున్నాయి.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జితేశ్‌ శర్మ, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణా

చదవండి: టీమిండియా స్పీడ్‌ గన్స్‌... ఫైరింగ్‌కు సిద్ధం!

 

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)