Breaking News

అశ్విన్‌కే సాధ్యం.. ముత్తయ్య మురళీధరన్‌ వరల్డ్‌ రికార్డు సమం

Published on Tue, 10/01/2024 - 17:19

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఎడిషన్‌లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సత్తా చాటాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న వేళ సెంచరీతో ఆదుకున్నాడు.

సొంత మైదానం చెపాక్‌లో నిలకడగా ఆడి 113 పరుగులు సాధించాడు. అంతేకాదు.. అదే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఇలా ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణించి.. బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి అశూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

రెండో టెస్టులోనూ అదరగొట్టి
ఇక కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అశ్విన్‌ అదరగొట్టాడు. తన స్పిన్‌ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను తిప్పలుపెట్టి కీలక వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో(31), షకీబ్‌ అల్‌ హసన్‌(9) వికెట్లు తీసిన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ జకీర్‌ హసన్‌(10), మొమినుల్‌ హక్‌(2), హసన్‌ మహమూద్‌(4)లను పెవిలియన్‌కు పంపాడు. అలా మొత్తంగా రెండో టెస్టులో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ముత్తయ్య మురళీధరన్‌ ప్రపంచ రికార్డు సమం
ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ బంగ్లాపై గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన అశ్విన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు వరించింది. అశూ టెస్టుల్లో ఈ పురస్కారం అందుకోవడం ఇది పదకొండోసారి కావడం విశేషం. తద్వారా శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ చెన్నై బౌలర్‌ సమం చేశాడు. 

మురళీధరన్‌ కూడా సంప్రదాయ క్రికెట్‌లో 11 సార్లు ఈ అవార్డు గెలిచాడు. కాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన రోహిత్‌ సేన.. కాన్పూర్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టెస్టుల్లో అత్యధికసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు గెలిచిన క్రికెటర్లు
ముత్తయ్య మురళీధరన్‌(శ్రీలంక)- 11 సార్లు
రవిచంద్రన్‌ అశ్విన్‌(ఇండియా)- 11 సార్లు
జాక్వెస్‌ కలిస్‌(సౌతాఫ్రికా)- 9 సార్లు
సర్‌ రిచర్డ్‌ హాడ్లీ(న్యూజిలాండ్‌)- 8 సార్లు
ఇమ్రాన్‌ ఖాన్‌(పాకిస్తాన్‌)- 8 సార్లు
షేన్‌ వార్న్‌(ఆస్ట్రేలియా)- 8 సార్లు.

చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)