Breaking News

BGT- 2023: ‘డూప్లికేట్‌’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే..

Published on Mon, 02/13/2023 - 09:36

India vs Australia, 1st Test- Nagpur: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా జట్టుపై భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఇప్పటికైనా పర్యాటక జట్టుకు అశ్విన్‌ డూప్లికేట్‌కు.. అసలైన అశ్విన్‌కు ఉన్న తేడా ఏమిటో అర్థమై ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

స్పిన్నర్ల దెబ్బకు విలవిల
కాగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్ల దెబ్బకు పర్యాటక జట్టుబ్యాటర్లు విలవిల్లాడిపోయారు. దీంతో.. ఏకంగా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో కంగారూలను మట్టికరిపించిన రోహిత్‌ సేన.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

అశూ, జడ్డూ అద్భుతం
ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ విశ్వరూపం చూపించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 12 ఓవర్లలో 37 పరుగులిచ్చిన అశూ.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా రెండు వికెట్లతో రాణించాడు. వీరిద్దరి దెబ్బకు ఆసీస్‌ 91 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌ ముగించి భారీ ఓటమిని మూటగట్టుకుంది.

మహేశ్‌ పితియాతో ప్రాక్టీస్‌
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా నాగ్‌పూర్‌ టెస్టుకు వారం రోజుల ముందే ప్రాక్టీసు​ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక అశ్విన్‌ మాదిరి బౌలింగ్‌ చేస్తాడని పేరొందిన గుజరాత్‌ బౌలర్‌ మహేశ్‌ పితియాతో ప్రాక్టీసు చేసింది. అయినప్పటికీ అసలైన పోరులో అశ్విన్‌ స్పిన్‌ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేశారు ఆసీస్‌ బ్యాటర్లు.


అశ్విన్‌తో మహేశ్‌ పితియా

ఈసారి జడ్డూ డూప్లికేట్‌ కోసం
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసీస్‌ జట్టుకు చురకలు అంటించాడు. ‘‘ఇప్పటికైనా డూప్లికేట్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఆడటానికి.. నిజమైన అశ్విన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఉన్న తేడా ఆస్ట్రేలియా తెలుసుకుని ఉంటుంది.

ఆల్‌టైట్‌ గ్రేటెస్ట్‌ను ఎదుర్కొనేందుకు.. ఫస్ట్‌క్లాస్‌లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన యువ బౌలర్‌తో ప్రాక్టీసు చేస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధమవలేరన్న వాస్తవం గ్రహించాలి. విషయం అర్థమైంది కదా! ఇక ఢిల్లీ మ్యాచ్‌ కోసం వాళ్లు జడేజా డూప్లికేట్‌ను వెదుకుతారని మాత్రం నేను అనుకోవడం లేదు’’ అని కైఫ్‌ ట్విటర్‌ వేదికగా ట్రోల్‌ చేశాడు.

కాగా తొలి టెస్టులో 70 పరుగులు చేయడంతో పాటు మొత్తంగా 7 వికెట్లు పడగొట్టిన జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ వేదికగా టీమిండియా- ఆసీస్‌ మధ్య ఫిబ్రవరి 17న రెండో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు
SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్‌ టైటిల్‌ను హస్తగతం చేసుకున్న సన్‌రైజర్స్‌
BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్‌ ప్లాన్‌.. మన ‘అశ్విన్‌ డూప్లికేట్‌’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)