Breaking News

ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌.. ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన బుమ్రా

Published on Wed, 01/01/2025 - 21:05

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్ట్‌ మ్యాచ్‌ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్‌ ఫలితాన్ని డిసైడ్‌ చేసే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాను ఓ ఆల్‌టైమ్‌ రికార్డు ఊరిస్తుంది. సిడ్నీ టెస్ట్‌లో బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే.. ఓ ద్వైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.

ప్రస్తుతం ఈ రికార్డు స్పిన్‌ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ 1972-73లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 35 వికెట్లు తీశారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 12.83 సగటున 30 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్లు ఘనతలు ఉండగా..రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.

ఓ ద్వైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..
1. బీఎస్ చంద్రశేఖర్ - 35 (ఇంగ్లండ్‌పై)
2. వినూ మన్కడ్ - 34 (ఇంగ్లండ్‌పై)
3. శుభాష్‌చంద్ర గుప్తా - 34 (న్యూజిలాండ్‌పై)
4. రవిచంద్రన్ అశ్విన్ - 32 (ఇంగ్లాండ్‌పై)
5. హర్భజన్ సింగ్  - 32 (ఆస్ట్రేలియాపై)
6 .కపిల్ దేవ్ - 32 (పాకిస్థాన్‌పై)
7. రవిచంద్రన్ అశ్విన్  - 31 (దక్షిణాఫ్రికాపై)
8. బిషన్ సింగ్ బేడీ  - 31 (ఆస్ట్రేలియాపై)
9. జస్ప్రీత్ బుమ్రా  - 30 (ఆస్ట్రేలియాపై)

కాగా, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో నాలుగు టెస్ట్‌ల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆతర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రా కాగా.. తాజాగా మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)