Breaking News

IND VS AUS: తగ్గేదేలేదన్న నితీశ్‌ రెడ్డి.. వైరలవుతున్న పుష్ప స్టయిల్‌ సెలబ్రేషన్స్‌

Published on Sat, 12/28/2024 - 09:22

బాక్సింగ్‌ డే టెస్ట్‌లో టీమిండియా నయా సెన్సేషన్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి(Nitish Kumar Reddy) అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఫాలో ఆన్‌ గండం నుంచి గట్టెక్కించిన నితీశ్‌.. టెస్ట్‌ల్లో తన తొలి హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం నితీశ్‌ చేసుకున్న సెలబ్రేషన్స్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి. 

మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది హాఫ్‌ సెంచరీ మార్కును అందుకున్న నితీశ్‌.. తగ్గేదేలేదంటూ పుష్ప స్టయిల్‌(Pushpa Style Celebrations)లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. నితీశ్‌ సెలబ్రేషన్స్‌కు క్రికెట్‌ అభిమానులు సహా సినీ ఫ్యాన్స్‌ కూడా ముగ్దులవుతున్నారు. నితీశ్‌ 'తగ్గేదేలే' సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఫాలో ఆన్‌ గండం నుంచి గట్టెక్కిన భారత్‌ 300 మార్కును దాటింది. నితీశ్‌.. వాషింగ్టన్‌ సుందర్‌తో (39) కలిసి ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 103 పరుగులు జోడించి భారత్‌ను ఫాలో గండం నుంచి గట్టెక్కించాడు. ప్రస్తుతం నితీశ్‌ 80ల్లోకి (85 నాటౌట్‌) ప్రవేశించాడు. 96 ఓవర్ల అనంతరం భారత్‌ స్కోర్‌ 324/7గా ఉంది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 150 పరుగులు వెనుకపడి ఉంది.

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 82, విరాట్‌ కోహ్లి 36, కేఎల్‌ రాహుల్‌ 24, రోహిత్‌ శర్మ 3, ఆకాశ్‌దీప్‌ 0, రిషబ్‌ పంత్‌ 28, రవీంద్ర జడేజా 17 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో బోలాండ్‌ 3, కమిన్స్‌ 2, లయోన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్‌ కొన్‌స్టాస్‌ (60), ఖ్వాజా (57), లబూషేన్‌ (72), పాట్‌ కమిన్స్‌ (49), అలెక్స్‌ క్యారీ (31) రాణించారు. ట్రవిస్‌ హెడ్‌ (0), మిచెల్‌ మార్ష్‌ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్‌ 2, సుందర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)