Breaking News

Ind vs Aus 3rd Test Day 1: అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌

Published on Sat, 12/14/2024 - 12:06

క్రికెట్‌ ప్రేమికులకు చేదు వార్త!.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. వరణుడి కారణంగా బ్రిస్బేన్‌లో తొలి రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రెండో రోజు ఆట మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.20 నిమిషాలకు మొదలై.. కనీసం 98 ఓవర్లపాటు మ్యాచ్‌ సాగనుంది. 

నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. ఇందులో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే రోహిత్‌ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో పెర్త్‌ టెస్టులో విజయంతో సిరీస్‌ మొదలుపెట్టిన భారత్‌.. అడిలైడ్‌లో మాత్రం ఆసీస్‌ ముందు తలవంచింది. పింక్‌ బాల్‌ టెస్టులో మరోసారి కంగారూ జట్టు చేతిలో ఓడిపోయింది.

టాస్‌ ఆలస్యం
ఫలితంగా ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది. తర్వాత కాస్త తెరిపినివ్వడంతో ఆట మొదలైంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

మరోసారి వరణుడి అడ్డంకి
ఈ క్రమంలో ప్రధాన పేసర్‌ జస్‌‍ప్రీత్‌ బుమ్రా కొత్త బంతితో బరిలోకి దిగాడు. మరో ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ కూడా వరుస ఓవర్లలో బౌలింగ్‌ చేశారు. అయితే, ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 13.2 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామం వరకు ఆటను వాయిదా వేశారు.

తొలిరోజు ఆట ముగిసిందిలా
కానీ.. వర్షం మాత్రం తగ్గలేదు. ఫలితంగా రెండో సెషన్ రద్దైపోయింది. అయితే, ఆ తర్వాత కూడా ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. వర్షం వల్ల మ్యాచ్‌ కొనసాగే పరిస్థితి లేనందువల్ల అంతటితో తొలిరోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 

ఇక శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్‌ ఖవాజా 19, నాథన్‌ మెక్‌స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా వర్సెస్‌ భారత్‌ మూడో టెస్టు(డిసెంబరు 14-18)
వేదిక: ది గబ్బా స్టేడియం, బ్రిస్బేన్‌
టాస్‌: టీమిండియా.. తొలుత బౌలింగ్‌
వర్షం వల్ల 13.2 ఓవర్లకే ముగిసిపోయిన ఆట
ఆసీస్‌ స్కోరు: 28/0

ప్లేయింగ్‌ ఎలెవన్‌
భారత తుది జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్‌ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

ఆస్ట్రేలియా తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్‌.

చదవండి: IND Vs AUS 3rd Test: బ్రిస్బేన్‌ టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌కు చేదు అనుభవం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)