Breaking News

రోహిత్‌ శర్మకు అనుకూలం.. టీమిండియాకు వ్యతిరేకం

Published on Fri, 10/24/2025 - 16:44

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు (Team India) క్లీన్‌ స్వీప్‌ భయం పట్టుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (India vs Australia) తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి, ఇదివరకే సిరీస్‌ కోల్పోయిన భారత జట్టు.. రేపు (అక్టోబర్‌ 25) సిడ్నీ వేదికగా జరుగబోయే మూడో వన్డేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

చెత్త రికార్డు
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గత రికార్డులు కలవరపెడుతున్నాయి. సిడ్నీలో భారత జట్టుకు చాలా చెత్త రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడిన 19 వన్డేల్లో భారత్‌ కేవలం​ రెండింట మాత్రమే గెలిచింది. 16 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలవగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు.

ప్రస్తుతం​ ఈ రికార్డే భారత క్రికెట్‌ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ సిడ్నీలో చరిత్ర రిపీటై భారత్‌ 17వ సారి ఓడితే ఆస్ట్రేలియా చేతిలో తొలి వైట్‌వాష్‌ (వన్డేల్లో) ఎదురవుతుంది.

రోహిత్‌కు అనుకూలం
సిడ్నీ మైదానంలో టీమిండియాకు వ్యతిరేకంగా ఉన్న ట్రాక్‌ రికార్డు, స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ విషయానికి వచ్చే సరికి అనుకూలంగా ఉంది. హిట్‌ మ్యాన్‌ గత నాలుగు వన్డేల్లో ఇక్కడ సెంచరీ, 2 అర్ద సెంచరీలు చేశాడు. చివరిగా (2019) ఆడిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ (133) బాదాడు.

సిడ్నీలో గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాపై రోహిత్‌ స్కోర్లు..
133 (129)
99 (108)
34 (48)
66 (87)

కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు తొలి రెండు వన్డేల్లో పరాజయాలపాలై మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కోల్పోయింది. సిడ్నీ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.

విరాట్‌ వైఫల్యాలు
ఏడు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత) ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అంచనాలను తలకిందులు చేస్తూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు వన్డేల్లో డకౌటై అభిమానుల తీవ్ర నిరాశకు గురి చేశాడు. తొలి వన్డేలో 8 బంతులు, రెండో వన్డేలో 4 బంతులు ఆడిన కోహ్లి ఖాతా కూడా తెరవలేకపోయాడు. అతని 17 ఏళ్ల కెరీర్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ కావడం ఇదే మొదటిసారి.

మరో పక్క కోహ్లితో పాటే ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ మాత్రం తొలి వన్డేలో (8) విఫలమైనా, రెండో వన్డేలో అత్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. పిచ్‌ నుంచి ఎలాంటి సహకారం లభించనప్పుడు చాలా బాధ్యతగా ఆడి అర్ద సెంచరీ (73) చేశాడు. 

రోహిత్‌ నిలకడగా ఆడటంతోనే తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ (264) చేయగలిగింది. అయితే బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, కీలక సమయాల్లో క్యాచ్‌లు నేలపాలు చేయడంతో భారత్‌ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. 

చదవండి: భారత్‌తో మూడో వన్డే.. ఆసీస్‌ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కు చోటు.. ఎవరీ ఆల్‌రౌండర్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)