Breaking News

భారత బౌలర్ల విజృంభణ... ఆసీస్‌ ఆలౌట్‌.. స్కోరెంతంటే?

Published on Sat, 10/25/2025 - 12:29

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (IND vs AUS 3rd ODI) బౌలర్లు రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును నామమాత్రపు స్కోరుకే ఆలౌట్‌ చేశారు. యువ పేసర్‌ హర్షిత్‌ రాణా (Harshit Rana) నాలుగు వికెట్లతో మెరిసి.. యాజమాన్యం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా చేదు అనుభవం చవిచూసింది. తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను ఆసీస్‌కు కోల్పోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.

సిరాజ్‌ మొదలెడితే..
ఆసీస్‌ టాపార్డర్‌లో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (25 బంతుల్లో 29) వేగంగా ఆడే ప్రయత్నంలో మొహమ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రసిద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక మరో ఓపెనర్‌, కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (41)ను అక్షర్‌ పటేల్‌ బౌల్డ్‌ చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మాథ్యూ షార్ట్‌ (30) వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

అదరగొట్టిన హర్షిత్‌
విరాట్‌ కోహ్లి అద్భుత క్యాచ్‌ అందుకుని షార్ట్‌ను పెవిలియన్‌కు పంపడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అలెక్స్‌ క్యారీ (24), కూపర్‌ కన్నోలి (23), మిచెల్‌ ఓవెన్‌ (1) రూపంలో మూడు కీలక వికెట్లు తీసిన హర్షిత్‌ రాణా.. జోష్‌ హాజిల్‌వుడ్‌ (0)ను కూడా అవుట్‌ చేశాడు. మొత్తంగా 8.4 ఓవర్లు బౌల్‌ చేసి 39 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

మిగతా వారిలో సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్‌ 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మ్యాట్‌ రెన్షా (56) టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. లోయర్‌ ఆర్డర్లో నాథన్‌ ఎల్లిస్‌ (16) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్‌ (2), జంపా (2*) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.  

ఇక సిడ్నీలో గత మూడు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా 237 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించి గెలుపు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.‌

చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ సంచలన క్యాచ్‌.. టీమిండియాకు ఊహించని షాక్‌!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)