Breaking News

శతక్కొట్టిన శ్రేయస్‌, శుభ్‌మన్‌.. భారీ స్కోర్‌ దిశగా టీమిండియా 

Published on Sun, 09/24/2023 - 16:39

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకుని కెరీర్‌లో మూడో వన్డే శతకాన్ని సాధించి ఔట్‌ కాగా.. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (92 బంతుల్లో 100 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డే కెరీర్‌లో ఆరో సెంచరీ నమోదు చేశాడు.

ఫలితంగా భారత్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. 33 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 230/2గా ఉంది. గిల్‌ (100), రాహుల్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 16 పరుగుల వద్ద రుతురాజ్‌ గైక్వాడ్‌ (8) వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీకు క్యాచ్‌ ఇచ్చి రుతు ఔటయ్యాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్‌ మార్ష్‌, మార్కస్‌ స్టోయినిస్‌, పాట్‌ కమిన్స్‌ స్థానాల్లో అలెక్స్‌ క్యారీ, జోష్‌ హాజిల్‌వుడ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ తుది జట్టులోకి వచ్చారు. 

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్

ఇండియా : శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)