Breaking News

రోహిత్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు! ఇది కదా ఊచకోత

Published on Wed, 01/17/2024 - 20:56

#RohitSharma Comeback- Hitman 5th T20I Century: అఫ్గనిస్తాన్‌ మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వింటేజ్‌ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌ అయిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఆ వైఫల్యాలను మరిపించేలా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

అఫ్గన్‌ బౌలర్ల ధాటికి సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ తానున్నానంటూ భరోసా ఇచ్చాడు. కాగా బెంగళూరులో టాస్‌ గెలిచిన తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా..  పవర్‌ ప్లేలోనే యశస్వి జైస్వాల్‌(4), విరాట్‌ కోహ్లి(0), శివం దూబే(1), సంజూ శాంసన్‌(0) రూపంలో టీమిండియా కీలక వికెట్లు కోల్పోయింది.

రోహిత్‌కు తోడై దంచికొట్టిన రింకూ
అప్పటికి జట్టుకు స్కోరు 30 పరుగులు మాత్రమే! అలాంటి సమయంలో ఆచితూచి ఆడుతూనే.. ఏదేమైనా తగ్గేదేలే అన్నట్లు రోహిత్‌ శర్మ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై అటాకింగ్‌ మొదలుపెట్టాడు. అగ్నికి ఆజ్యంలా రోహిత్‌కు తోడైన యంగ్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌(69 నాటౌట్‌) కూడా ధనాధన్‌ బ్యాటింగ్‌తో అఫ్గన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నా రోహిత్‌ శర్మ పరుగుల దాహం తీరలేదు. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 69 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. 2019 తర్వాత పొట్టి ఫార్మాట్లో తన తొలి శతకం నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

అదే విధంగా.. రోహిత్‌ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు.  

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లు
1.రోహిత్‌ శర్మ(ఇండియా)- 5
2.సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 4
3.గ్లెన్‌ మాక్స్‌వెల్‌(ఆస్ట్రేలియా)- 4.

కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(1643 పరుగులు) అవతరించాడు. తద్వారా విరాట్‌ కోహ్లి పేరిట(1570 రన్స్‌) ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టాడు. 

చదవండి: Ind vs Afg T20I: గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి.. కెరీర్‌లో ఇదే తొలిసారి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)