Breaking News

భారత్‌తో వన్డే.. శ్రీలంక భారీ స్కోరు

Published on Sat, 07/04/2026 - 14:52

భారత్‌ అండర్‌-19 క్రికెట్‌ జట్టుతో తొలి అనధికారిక వన్డేలో శ్రీలంక అండర్‌-19 జట్టు భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో తడబడ్డా ఎట్టకేలకు మూడు వందల పరుగుల మార్కు దాటింది. కాగా మూడు అనధికారిక వన్డేలు, రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది.  

ఆరంభంలో ఎదురుదెబ్బ
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శనివారం వన్డే సిరీస్‌ మొదలైంది. హంబన్‌టోటా వేదికగా తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ దుల్నిత్‌ సిగేరా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌ అయ్యాడు.

ఆ తర్వాత సీన్‌ రివర్స్‌
అయితే, భారత జట్టుకు ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్‌ దిమాంత మహవితన (42)తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగోడ (Senuja Wekunagoda- 91) స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే, కావ్యా పటేల్‌ బౌలింగ్‌లో అర్జున్‌ రాజ్‌పుత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

కెప్టెన్‌ విమత్‌ దిన్సారా (1) పూర్తిగా విఫలం కాగా.. కవిజ గమాగే అర్ధ శతకం (77)తో దుమ్ములేపాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల 46 పరుగులతో అజేయంగా నిలవగా.. వికెట్‌ కీపర్‌ చమరిందు నెత్సారా 21 పరుగులు చేయగలిగాడు. 

కిత్మా వితానపతిరణ 5 బంతుల్లో 18 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి శ్రీలంక 320 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కావ్యా పటేల్‌ రెండు, మోహిత్‌ ఉల్వా, రోహిత్‌ యాదవ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

UPDATE: నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్‌

చదవండి:  ‘నిన్ను ఆడించమని అతడికి చెప్పేయండి’

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)