Breaking News

IND Tour Of SA: గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీలు

Published on Fri, 12/22/2023 - 10:30

సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు ముందు ప్రిటోరియాలో జరిగిన మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్‌ వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌, ఇండియా-ఏ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీలతో కదంతొక్కారు.

ఈ మ్యాచ్ రెండో రోజు గిల్‌ సెంచరీతో మెరవగా.. మూడో రోజు ఆటలో సర్ఫరాజ్‌ ఖాన్‌ మూడంకెల స్కోర్‌ను చేశాడు. గిల్‌ ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడన్న విషయం తెలియలేదు కానీ.. సర్ఫరాజ్‌ మాత్రం 61 బంతుల్లోనే మెరుపు శతకం బాదినట్లు సమాచారం. ఇదే మ్యాచ్‌లో మరో టీమిండియా ఆటగాడు యశస్వి జైస్వాల్‌ అర్ధసెంచరీ చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్మప్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులను కానీ, మీడియాను కానీ అనుమతించలేదు. 

కాగా, సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు తొలి టెస్ట్‌ సెంచూరియన్‌ వేదికగా జరుగనుండగా.. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్‌ మ్యాచ్‌ కేప్‌టౌన్‌లో జరుగుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడగా.. టీ20 సిరీస్‌ 1-1తో సమం కాగా, వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

పార్ల్‌ వేదికగా నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 78 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సంజూ శాంసన్‌ (108) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్‌ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (38) తనదైన స్టయిల్‌లో మెరుపులు మెరిపించాడు.

అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/30), వాషింగ్టన్‌ సుందర్‌ (2/38), ఆవేశ్‌ ఖాన్‌ (2/45), అక్షర్‌ పటేల్‌ (1/48), ముకేశ్‌ కుమార్‌ (1/56) రాణించడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. 
 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)