Breaking News

నాలుగో టీ20లో భారత్‌ ఘన విజయం..

Published on Thu, 11/06/2025 - 17:24

క్వీన్స్‌లాండ్ వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్(India) ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్‌ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక కంగారులు చతకలపడ్డారు. 

లక్ష్య చేధనలో ఆసీస్‌ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(30), మాథ్యూ షార్ట్‌(25) ఘనమైన ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిడిలార్డర్‌ విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 

అక్షర్‌ మ్యాజిక్‌..
భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ బంతితో మ్యాజిక్‌ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. అక్షర్‌ దూకుడుగా ఆడుతున్న షార్ట్‌ను ఔట్‌ చేసి భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. అతడితో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ మూడు, శివమ్‌ దూబే రెండు, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా అర్ష్‌దీప్‌ సింగ్‌ తలా వికెట్‌ సాధించారు.

రాణించిన గిల్‌..
అంతకుముందు బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శుభ్‌మన్ గిల్ 46 ప‌రుగుల‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ అతడు 120 కంటే తక్కువ స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇక గిల్‌తో పాటు అభిషేక్‌ శర్మ(28), అక్షర్‌ పటేల్‌(21) రాణించారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లతో సత్తాచాటారు. ఇక ఇరు జట్ల మధ్య ఐదో టీ20 బ్రిస్బేన్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే 3-1తో సిరీస్ సొంతం​ చేసుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే 2-2 సిరీస్ సమంగా ముగుస్తుంది.
చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్‌ ప్లాప్‌

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)