గట్టెక్కిన దక్షిణాఫ్రికా

Published on Mon, 10/13/2025 - 22:32

సాక్షి, విశాఖపట్నం: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా కష్టపడి గెలిచింది. లక్ష్యఛేదనలో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న సఫారీ జట్టును మరిజన్‌ కాప్‌ (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్‌)... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్లో ట్రయాన్‌ (69 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్‌) వీరోచిత పోరాటంతో గట్టెక్కించారు. దీంతో దక్షిణాఫ్రికా ఆఖరి ఓవర్‌దాకా పోరాడి 3 బంతులు మిగిలి ఉండగా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. 

సఫారీకిది వరుసగా మూడో విజయం కాగా... బంగ్లాదేశ్‌కు మూడో పరాజయం. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్జానా హక్‌ (30; 3 ఫోర్లు), రుబియా హైదర్‌ (25) తొలి వికెట్‌కు 53 పరుగులతో చక్కని ఆరంభాన్నిచ్చారు. వీళ్లిద్దరు అవుటయ్యాక... టాపార్డర్‌ బ్యాటర్‌ షర్మిన్‌ అక్తర్‌ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు), కెపె్టన్‌ నిగార్‌ సుల్తానా (42 బంతుల్లో 32; 5 ఫోర్లు) కుదురుగా ఆడి మరో పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. షర్మిన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆఖర్లో షోర్న అక్తర్‌ (35 బంతుల్లో 51 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. రీతూ మోనీ (8 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు)తో కలిసి వేగంగా పరుగులు జతచేసింది. సఫారీ బౌలర్లలో ఎంలాబా 2 వికెట్లు, డి క్లెర్క్, ట్రయాన్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి గెలిచింది. 

ఆరంభంలోనే బ్రిట్స్‌ (0) వికెట్‌ కోల్పోగా... లారా వోల్‌వార్ట్‌ (56 బంతుల్లో 31; 5 ఫోర్లు), అనికె బాష్‌ (35 బంతుల్లో 28; 6 ఫోర్లు) జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. అయితే 20 పరుగుల వ్యవధిలో క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరితో పాటు డెర్క్‌సెన్‌ (2), సినాలో జాఫ్టా (4) నిష్క్రమించారు. దీంతో 78/5 స్కోరు వద్ద సఫారీకి పరాజయం తప్పదనిపించింది. ఈ దశలో మరిజన్‌ కాప్, ట్రయాన్‌ ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా గెలుపు ట్రాక్‌లో పడింది. 

ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తయ్యాక అవుటయ్యారు. అయితే డిక్లెర్క్‌ (29 బంతుల్లో 37 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేసింది. భారత్‌ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసినట్లే కీలకమైన పరుగులతో బంగ్లాదేశ్‌తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇంకో 3 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో నహిదా అక్తర్‌ 2, రబియా ఖాన్, ఫాహిమా, రీతు మోని తలా ఒక వికెట్‌ తీసి సఫారీని ఇబ్బంది పెట్టారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్‌ తలపడుతుంది.   

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)