నిప్పులు చెరిగిన ఆసీస్‌ పేసర్‌.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక

Published on Fri, 01/23/2026 - 15:04

అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్‌, జపాన్‌పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్‌ (ఏ) మ్యాచ్‌లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం​ విజయాన్ని సొంతం చేసింది.

విండ్హోక్‌లోని నమీబియా క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. పేసర్‌ విల్‌ బైరోమ్‌ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్‌కు జతగా ఛార్లెస్‌ లచ్‌మండ్‌ (5-1-19-2), కేసీ బార్టన్‌ (4-0-13-2), హేడెన్‌ ష్కిల్లర్‌ (3-0-11-1) కూడా రాణించారు. 

ఆసీస్‌ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్‌ దిమంత మహావితన డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ విరాన్‌ చముదిత, దుల్నిత్‌ సిగెరా, ఆడమ్‌ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్‌ విమత్‌ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్‌ రింసర, కుగథాస్‌ మథులాన్‌ తలో 6 పరుగులు చేశారు. 

కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ల్లో జపాన్‌, ఐర్లాండ్‌పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. 
 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)