Breaking News

టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన భారత్‌

Published on Sun, 01/19/2025 - 14:12

అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ బోణీ కొట్టింది. కౌలాలంపూర్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. 

పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్‌ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్‌ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో అసాబి ఖలందర్‌ (12), కేనిక కస్సార్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్‌ బ్యాటర్లు డకౌటయ్యారు.

45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 4.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్‌ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్‌ బౌలర్‌ క్లాక్స్‌టన్‌కు త్రిష వికెట్‌ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్‌తో కలిసి గ్రూప్‌-ఏలో పోటీ పడుతుంది.

గ్రూప్‌-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్‌ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 

163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. 

ఈ టోర్నీలో భారత్‌ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్‌ ఆడుతుంది. జనవరి 23న భారత్‌.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడుతుంది.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)