Breaking News

వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

Published on Thu, 12/11/2025 - 17:15

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌-2026 ఎడిషన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఆడబోయే తమ యువ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌కు ఒలీవర్‌ పీక్‌ సారథ్యం వహించనున్నాడు.

ఇక వరల్డ్‌కప్‌ ఆడే ఆసీస్‌ యువ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లకు కూడా చోటు దక్కడం విశేషం. అంతేకాదు ఈ టీమ్‌లో ఇద్దరు శ్రీలంక సంతతి, చైనా సంతతికి ఓ ఆటగాడికి కూడా సెలక్టర్లు చోటివ్వడం గమనార్హం.

పాల్గొనే జట్లు ఇవే
కాగా వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు అండర్‌-19 మెన్స్‌ వరల్డ్‌కప్‌ (ICC U19 Mens World Cup 2026) నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఐసీసీ టోర్నీకి నమీబియా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో గ్రూప్‌-ఎ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, జపాన్‌, శ్రీలంక పాల్గొంటుండగా.. గ్రూప్‌-బి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, అమెరికా పోటీపడతాయి.

కెప్టెన్‌ ఎవరంటే?
ఇక గ్రూప్‌-సి నుంచి ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే.. అదే విధంగా గ్రూప్‌-డి నుంచి అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తాజాగా తమ జట్టును ప్రకటించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆసీస్‌కు లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఒలీవర్‌ పీక్‌ సారథిగా వ్యవహరించబోతున్నాడు.

భారత్‌తో ఫైనల్లో సత్తా చాటి
సౌతాఫ్రికాలో 2024లో జరిగిన వరల్డ్‌కప్‌ టోర్నీలో ఒలీవర్‌ (Oliver Peake) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 120 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత్‌తో ఫైనల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆస్ట్రేలియా టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

అంతేకాదు పందొమిదేళ్ల ఈ కుర్ర బ్యాటర్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవన్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏకంగా ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్‌ కొట్టేశాడు.

అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు
ఒలీవర్ పీక్ (కెప్టెన్), కేసీ బార్టన్, నాడెన్ కూరే (శ్రీలంక సంతతి), జేడెన్ డ్రేపర్, స్టీవెన్ హోగన్, థామస్ హోగన్, బెన్ గోర్డాన్, జాన్ జేమ్స్ (భారత సంతతి), చార్లెస్ లాచ్మండ్, అలెక్స్ లీ యంగ్ (చైనా సంతతి), విల్ మలాజ్జుక్, నితేశ్‌ సామ్యూల్ (శ్రీలంక సంతతి), హేడెన్ షీలర్, ఆర్యన్ శర్మ (భారత సంతతి), విలియం టేలర్.

చదవండి: జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్‌ కొడుకులు

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)