Breaking News

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా

Published on Thu, 03/05/2026 - 13:41

అమెరికా, ఇజ్రాయిల్‌–ఇరాన్ యుద్ధ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఇప్పటికే పాకిస్తాన్‌ షాహీన్స్‌-ఇంగ్లండ్‌ లయన్స్‌ మధ్య అబుదాబీలో జరగాల్సిన అనధికారిక వన్డే సిరీస్‌ రద్దు కాగా.. తాజాగా ఐసీసీ టోర్నీ వాయిదా పడింది. 

నేపాల్‌లోని ఖాట్మండు వేదికగా మార్చి 10 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ICC Men’s Cricket World Cup League 2లో పలు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. ఈ మ్యాచ్‌లలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లు పాల్గొనాల్సి ఉంది. వాయిదా విషయాన్ని క్రికెట్ నేపాల్ అధికారికంగా ప్రకటించింది. కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

కాగా, ICC Men’s Cricket World Cup League 2 టోర్నీ ద్వారా 2027 వన్డే ప్రపంచకప్‌లో నాలుగు బెర్త్‌లు ఖరారవుతాయి. ఈ క్వాలిఫయర్‌ టోర్నీ వాయిదా ఆయా జట్ల అర్హత అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లతో పాటు యూఎస్‌ఏ, స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌, కెనడా, నమీబియా జట్లు పాల్గొంటున్నాయి.

ఇదిలా ఉంటే, పశ్చిమాసియాలో యుద్దం పరోక్షంగానూ క్రికెట్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ యుద్దం కారణంగా గల్ఫ్‌లో దుబాయ్‌ సహా ప్రధాన విమానాశ్రయాలన్నీ మూసివేయడంతో టీ20 ప్రపంచకప్‌ 2026లో పాల్గొన్న పలు జట్లు స్వదేశాలకు తిరిగి వెళ్లలేకపోయాయి. 

మరోపక్క సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగించుకున్న పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు కూడా అక్కడే ఇరుక్కుపోయింది. ఈ విషయాలను ఐసీసీ దగ్గరుండి పరిశీలిస్తూ.. ఆయా జట్లకు తగిన సహాయ సహకారాలు అందిస్తుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)