Breaking News

వరల్డ్‌కప్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Published on Thu, 01/29/2026 - 17:58

త్వరలో భారత్‌, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి ఓ ముఖ్య సమాచారం అందుతోంది. ఈ మెగా టోర్నీ ఓపెనింగ్‌ సెర్మనీ ఖరారు కావడంతో పాటు వేడుక జరిగే తేదీ మరియు సమయాన్ని ప్రకటించారు. టోర్నీ ప్రారంభమయ్యే ఫిబ్రవరి 7వ తేదీనే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.

ఆ రోజు వేర్వేరు వేదికల్లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగనుండగా.. మూడో మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. మూడో మ్యాచ్‌లో భారత్‌, యూఎస్‌ఏ జట్లు ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి ముందే ఓపెనింగ్‌ సెర్మనీ జరుగుతుం​ది.

అదే రోజు టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కొలొంబో వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్‌ వెస్టిండీస్‌, స్కాట్లాండ్ మధ్య కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 భారత్‌, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లలన్నీ గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విడిపోయాయి. 

గ్రూప్‌-సి నుంచి బంగ్లాదేశ్‌ తప్పుకోవడంతో స్కాట్లాండ్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చింది. భారత్‌, పాక్‌ గ్రూప్‌-ఏలో పోటీపడనున్నాయి. పాక్‌ తమ మ్యాచ్‌లన్నీ (భారత్‌ మ్యాచ్‌తో సహా) శ్రీలంకలో ఆడనుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 15న కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

గ్రూప్‌ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు.. సెమీస్‌లో గెలిచే జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. 

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం