Breaking News

ఆసీస్‌ ప్లేయర్‌కు అక్షింతలు

Published on Wed, 08/20/2025 - 19:23

ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు ఐసీసీ అక్షింతలు వేసింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే సందర్భంగా అభ్యంతరకర భాష వాడినందుకు ఓ డీమెరిట్‌ పాయింట్‌ అతని ఖాతాలో చేర్చింది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఇది లెవెల్‌-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. సాధారణంగా ఇలాంటి తప్పిదాలకు ఒకటి లేదా రెండు డీమెరిట్‌ పాయింట్లతో పాటు 50 శాతం వరకు మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధిస్తారు. అయితే గడిచిన 24 నెలల్లో జంపాకు ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం ఓ డీమెరిట్‌ పాయింట్‌తో సరిపెట్టారు.

ఏం జరిగిందంటే..?
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 37వ ఓవర్ సందర్భంగా జంపా అభ్యంతరకర భాష వాడాడు. మిస్‌ ఫీల్డ్‌తో పాటు ఓవర్‌ త్రో చేయడంతో జంపా సహనం ​కోల్పోయి ఇలా ప్రవర్తించాడు. జంపా వాడిన భాష స్టంప్‌ మైక్‌ల్లో రికార్డైంది. దీని ఆధారంగా జంపాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ శిక్షను స్వీకరించడంతో జంపాను తదుపరి విచారణ నుంచి మినహాయించారు.

కాగా, సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ ఐదు వికెట్లు తీసి ఆసీస్‌ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్‌ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయన్‌ (1/46) తోడయ్యారు.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్‌ హెడ్‌ (27), బెన్‌ డ్వార్షుయిస్‌ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్‌ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లలో హెడ్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఆడమ్‌ జంపా (10-0-58-1) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఆగస్ట్‌ 22న జరుగనుంది.

 

 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)