Breaking News

కోహ్లిని వెనక్కునెట్టిన గిల్‌.. హిట్‌మ్యాన్‌ ఏ స్థానంలో ఉన్నాడంటే..?

Published on Wed, 01/25/2023 - 15:38

న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దుమ్మురేపింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ (114 రేటింగ్‌ పాయింట్లు).. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. అలాగే బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లోనూ సత్తా చాటింది.

న్యూజిలాండ్‌ సిరీస్‌ (2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు)తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) అద్భుతంగా రాణించిన భారత స్టార్‌ పేసర్‌, హైదరాబాద్‌ కా షాన్‌ మహ్మద్‌ సిరాజ్‌ మియా తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించగా.. బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అదరగొట్టారు.

న్యూజిలాండ్‌ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 360 పరుగులు (209, 40 నాటౌట్‌, 112), అంతకుముందు శ్రీలంక సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేసిన (70, 21, 116) గిల్‌.. కివీస్‌తో సిరీస్‌లో అంతగా రాణించని రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లిని వెనక్కునెట్టి, ఏకంగా 20 స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా, కివీస్‌తో ఆఖరి వన్డేలో శతకం బాదిన రోహిత్‌ ఓ స్థానం మెరుగుపర్చుకుని 9వ స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్‌, డికాక్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)