Breaking News

ICC: కీలక సమావేశం.. ఐసీసీ కొత్త ప్రణాళికలు

Published on Thu, 07/17/2025 - 10:34

టీ20 ప్రపంచకప్‌-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌లో ఆడేందుకు ఇటీవలే ఇటలీ దేశపు జట్టు అర్హత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు పెరుగుతున్న ఆసక్తి, యూరోప్‌ దేశాల్లోనూ ఆట విస్తరిస్తున్న తీరుకు ఇది సరైన ఉదాహరణ. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఇప్పుడు సరిగ్గా దీనిపైనే మరింత దృష్టి పెట్టనుంది. కొత్త దేశాల్లో క్రికెట్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించాలని ఐసీసీ భావిస్తోంది.

24 జట్లకు పెంచే ప్రతిపాదన
ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మరింత సమగ్ర చర్చ, భవిష్యత్తు కార్యాచరణ విషయంలో ఐసీసీ చర్చించనుంది. గురువారం (జూలై 17) నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ప్రధాన ఎజెండాల్లో ఇది కూడా ఒకటి. వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌ 20 జట్లతో జరగనుంది. దీనిని ఆ తర్వాత 24 జట్లకు పెంచే ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చిస్తారు.  

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ బోర్డుల మద్దతు
అమెరికా–వెస్టిండీస్‌లలో జరిగిన 2024 టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ కొనసాగుతుండగా... విచారణలో వెల్లడైన అంశాలతో ఏజీఎంలో నివేదిక ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. టెస్టు క్రికెట్‌ను పెద్ద, చిన్న జట్లతో రెండు వేర్వేరు స్థాయిల్లో నిర్వహించే అంశంపై కూడా చర్చించనున్నారు. ఇలా టెస్టులను వర్గీకరించే అంశానికి  ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ బోర్డులు గట్టిగా మద్దతు పలుకుతున్నాయి.

జాంబియా రీ ఎంట్రీ
తాజాగా ఆసీస్‌పై విండీస్‌ 27 ఆలౌట్‌ ప్రదర్శనను బట్టి చూస్తే దీనిపై గట్టిగానే చర్చ సాగనుంది. అయితే 2025–27 డబ్ల్యూటీసీ టెస్టుల షెడ్యూల్‌ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏదైనా మార్పుపై నిర్ణయం తీసుకుంటే 2027 తర్వాతే సాధ్యమవుతుంది. 

మరో వైపు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 2019లో సస్పెన్షన్‌కు గురైన జాంబియా జట్టుకు ఐసీసీ అసోసియేట్‌ టీమ్‌గా మళ్లీ అవకాశం కల్పించనుండగా...తొలిసారి ఈస్ట్‌ తైమూర్‌ టీమ్‌ కూడా ఐసీసీలో భాగం కానుంది. ఐసీసీ కొత్త సీఈఓ హోదాలో సంజోగ్‌ గుప్తా తొలిసారి ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించనున్నారు. 

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీ20 యోధుడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)