శ్రీలంక క్రికెట్‌కు భారీ ఊరట

Published on Mon, 01/29/2024 - 07:36

శ్రీలంక క్రికెట్‌కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆ జట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. నిషేధం ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఆదివారం (జనవరి 28) ప్రకటించింది. సభ్య దేశంగా ఉండి బాధ్యతల ఉల్లంఘణకు పాల్పడటంతో పాటు బోర్డు అంతర్గత వ్యవహారాల్లో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని సహించని ఐసీసీ నవంబర్‌ 10న శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై (ఎస్‌ఎల్‌సీ) నిషేధాన్ని విధించింది.

లంక క్రికెట్‌ బోర్డు స్వయంప్రతిపత్తిని కోల్పోయి, స్థానిక రాజకీయ నాయకుల చేతుల్లో పావుగా మారి అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆ దేశ ఆడిటర్‌ జనరల్‌ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐసీసీ ఎస్‌ఎల్‌సీపై నిషేధం విధించింది. వన్డే వరల్డ్‌కప్‌ 2023 అనంతరం షమ్మీ సిల్వ నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్‌ బోర్డును ఐసీసీ రద్దు చేసింది. ఎస్‌ఎల్‌సీపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ దేశంలో జరగాల్సిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2024 సౌతాఫ్రికాకు తరలించబడింది.

బోర్డు రద్దు అనంతరం రెండు నెలలపాటు పరిస్థితిని సమీక్షించిన ఐసీసీ తాజాగా సమావేశమై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఎస్‌ఎల్‌సీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాన్‌ను ఎత్తి వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌ జట్టుకు ఎలాంటి అంతర్జాతీయ కమిట్‌మెంట్స్‌ లేకపోవడంతో ఆ దేశ ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆ జట్టు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది. 
 

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)