Breaking News

మ్యాచ్‌ రద్దు చేసుకున్న పాక్‌.. స్పందించిన బీసీసీఐ!

Published on Mon, 02/02/2026 - 12:56

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చే అవకాశాలు ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే నడుచుకునేందుకు పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సిద్ధమైంది.

శ్రీలంకలో పాక్‌ మ్యాచ్‌లు
కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లు ఆడేలా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) షెడ్యూల్‌ ఖరారు చేసింది.

భద్రతా కారణాలా?
ఇందులో భాగంగా భారత్‌- పాకిస్తాన్‌ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా తలపడాల్సి ఉంది. అయితే, తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి.. బంగ్లాదేశ్‌కు మద్దతు పలుకుతూ పాక్‌తో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుంది. ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపడం గమనార్హం.

కఠిన చర్యలకు సిద్ధం 
ఈ నేపథ్యంలో శ్రీలంకలో మిగతా మ్యాచ్‌లకు లేని ఈ సాకు.. కేవలం టీమిండియాతో మ్యాచ్‌కు మాత్రమే ఉందనడి చెప్పడం పాక్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాక్‌ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న ఐసీసీ.. కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

దేవజిత్‌ సైకియా ఏమన్నారంటే
ఈ పరిణామాలపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియాను స్పందించాల్సిందిగా మీడియా కోరింది. ఇందుకు బదులుగా.. ‘‘ఈ విషయం గురించి మాకు అధికారిక సమాచారం వచ్చేంతవరకు నేను ఎలాంటి వ్యాఖ్య చేయలేను. మ్యాచ్‌ రద్దు విషయమై స్పష్టమైన సమాచారం లేనందున ఈ అంశం గురించి మాట్లాడే హక్కు నాకైతే ప్రస్తుతానికి లేదు’’ అని న్యూస్‌18తో పేర్కొన్నారు.

ఐసీసీ చెప్పినట్లే..
అయితే, బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ శుక్లా స్పందిస్తూ.. ‘‘ఐసీసీ ఓ కీలక ప్రకటన జారీ చేసింది. క్రీడా స్పూర్తి గురించి ఐసీసీ మాట్లాడింది. ఐసీసీతో మేము ఏకీభవిస్తున్నాం. ఐసీసీతో చర్చించిన తర్వాతే మేము ఈ విషయంపై కామెంట్‌ చేయగలము’’ అని పేర్కొన్నారు. 

కాగా పాక్‌ తమ నిర్ణయం గురించి తమకు అధికారికంగా తెలియజేయలేదని పేర్కొన్న ఐసీసీ.. సెలక్టివ్‌గా మ్యాచ్‌లు ఎంచుకోవడం సరికాదని కౌంటర్‌ ఇచ్చింది.  బంగ్లాదేశ్‌ కూడా ఇలాగే తెగేదాకా లాగితే... ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీ.. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చిన విషయం తెలిసిందే.  

చదవండి: భారత్‌తో మ్యాచ్‌ రద్దు.. పాకిస్తాన్‌కు తప్పదు భారీ మూల్యం

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)