భార‌త్-పాక్ మ్యాచ్‌పై ఐసీసీ కీల‌క నిర్ణ‌యం

Published on Fri, 02/06/2026 - 20:01

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ దాదాపుగా లేనట్టే. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాలను ఐసీసీ (ICC) తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భార‌త్-పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డాల్సి ఉంది.  కానీ రాజ‌కీయ ఉద్రిక్త‌ల కార‌ణంగా భార‌త్‌తో మ్యాచ్‌ను బాయ్‌క‌ట్ చేస్తున్న‌ట్లు పాకిస్తాన్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటికీ ఐసీసీకి ఎటువంటి అధికారిక సమాచారం అంద‌లేదు. ఈ మ్యాచ్‌ను బాయ్‌క‌ట్ చేస్తే తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కొవల్సి వ‌స్తుంద‌ని ఐసీసీ హెచ్చరించిన‌ప్పట‌కి పాక్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసింది.

ఈ మ్యాచ్ రద్దయితే అన్ని విధాల‌గా తమ దేశం భారీగా నష్టపోతుందని ఆ లేఖ‌లో శ్రీలంక క్రికెట్ పేర్కొంది. ఇప్ప‌టికే అన్ని ర‌కాల ఏర్పాట్లు చేశామ‌ని,  బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని లంక బోర్డు కోరింది. అయినా కూడా పీసీబీ వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాలేదు. 

ఈ సందిగ్ధత వల్లే టికెట్లు విక్రయించిన తర్వాత ఒకవేళ మ్యాచ్ రద్దయితే, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఐసీసీ బుకింగ్స్‌ను నిలిపివేసింది. ప్రేమ‌దాస స్టేడియంలో జ‌రిగే ఇతర ఎనిమిది మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం బుకింగ్ పోర్టల్‌లో కనిపించడం లేదు.  ఈ మెగా టోర్నీ శ‌నివారం(ఫిబ్ర‌వ‌రి 7) నుంచి ప్రారంభం కానుంది.
 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)